మంగళవారం 26 జనవరి 2021
Cinema - Oct 19, 2020 , 09:09:09

హౌజ్‌మేట్స్‌ని కూర‌గాయ‌ల‌తో పోల్చిన కుమార్ సాయి

హౌజ్‌మేట్స్‌ని కూర‌గాయ‌ల‌తో పోల్చిన కుమార్ సాయి

బిగ్ బాస్ సీజ‌న్ 4లో ఆరోకంటెస్టెంట్‌గా బ‌య‌ట‌కు వ‌చ్చిన కుమార్ సాయి.. నాగ్ త‌న కథ వింటాన‌ని అభ‌యం ఇచ్చినందుకు చాలా ఆనందించాడు. ఇక వెళ్ళే ముందు కుమార్ సాయిని ఎవ‌రెవ‌రిని ఏ కూర‌గాయ‌ల‌తో పోలుస్తావు చెప్పాల‌ని అన్నాడు. ఇందుకోసం బిగ్ బాస్ స్టేజ్‌పై కూర‌గాయ‌ల బండిని తెప్పించాడు. ముందుగా ఉల్లిపాయ‌ని ఎంపిక చేసుకున్న కుమార్ సాయి ఇది అరియానికి సెట్ అవుతుంద‌ని అన్నారు. ఉల్లిపాయ‌లో పొర‌లు ఎలా ఉంటాయో అరియానాలో అన్ని వేరియ‌ష‌న్స్ ఉంటాయ‌ని చెప్పుకొచ్చాడు. 

ఇక  అరటిపండు తో అవినాష్ ని పోల్చ‌గా, కరివేపాకుతో  అఖిల్ ని, కాకరకాయ తో అమ్మ రాజశేఖర్‌ని, కీరదోస - అభిజీత్, మొక్కజొన్న - లాస్య, క్యాబేజ్ - నోయల్, వేరుశనగ - సోహెల్, పైనాపిల్ - దివి, వంకాయ - హారిక,  బాయిల్డ్ ఎగ్ - మెహబూబ్ అని చెప్పుకొచ్చారు కుమార్ సాయి. అయితే కుమార్ మాట‌ల‌ను అఖిల్‌, దివితో పాటు కొంద‌రు జీర్ణించులేక‌పోయారు. ఇక జోక‌ర్ డ్యాన్స్‌తో అద‌ర‌గొట్టిన కుమార్‌ని బిగ్ బాస్ స్టేజ్‌పై డ్యాన్స్ చేయ‌మ‌ని కంటెస్టెంట్స్ కోర‌గా,  మ‌రో సారి డ్యాన్స్ చేశారు.

ఇక చివరిగా బిగ్ బాంబ్‌ను అమ్మ రాజశేఖర్‌పై వేశారు కుమార్ సాయి. ఈ బాంబ్ ప్ర‌కారం  బాత్‌రూమ్‌లు వారం రోజులపాటు శుభ్రం చేయాలి. పెద్ద దిక్కుగా మీరే వాటిని నీట్‌గా ఉంచుతార‌ని న‌మ్మి వేసాను అని కుమార్ సాయి అన్నారు. ఇక క‌న్పెష‌న్ రూం నుండి  బ‌య‌ట‌కు వ‌చ్చిన మోనాల్‌కు హౌజ్ మేట్స్ అంద‌రు గ్రాండ్ వెల్‌క‌మ్ చెప్పారు. అఖిల్ అయితే ఆమెను గ‌ట్టిగా హ‌గ్ చేసుకొని ఎమోష‌న‌ల్ అయ్యాడు. వీరి వాల‌కం చూస్తుంటే ఇద్ద‌రి మ‌ధ్య ఏదో న‌డుస్తుంద‌నే అభిప్రాయం హౌజ్‌మేట్స్‌తో పాటు ప్రేక్ష‌కుల‌లోను క‌లుగుతుంది. ఇక ఈ రోజు సోమవారం కావ‌డంతో నామినేష‌న్ ప్ర‌క్రియ ఉండ‌నుంది. ఈ వారం ఎవ‌రు నామినేష‌న్‌లోకి వెళ‌తారో చూడాలి.


logo