మంగళవారం 26 జనవరి 2021
Cinema - Oct 19, 2020 , 08:50:13

ఆ ఇద్ద‌రిలో ఒకరిని ఎలిమినేట్ చేసిన నాగార్జున‌

ఆ ఇద్ద‌రిలో ఒకరిని ఎలిమినేట్ చేసిన నాగార్జున‌

బిగ్ బాస్‌కు సంబంధించి ఆదివారం జ‌రిగిన ఎపిసోడ్‌లో ముందుగా గేమ్స్ ఆడించిన నాగార్జున త‌ర్వాత ప్రాప‌ర్టీస్ ని ఉప‌యోగించి ఇద్ద‌రు డ్యాన్స్ లు చేయాల‌ని చెప్పారు. ఇద్ద‌రిలో ఎవ‌రు బాగా డ్యాన్స్ చేశార‌నేది అమ్మ రాజ‌శేఖ‌ర్ మాస్ట‌ర్ నిర్ణ‌యించాల‌ని సూచించారు. ముందుగా గొడుగు ప‌ట్టుకొని డ్యాన్స్ చేయ‌మ‌ని హారిక‌, అభిజిత్‌ల‌కు చెప్ప‌గా ఇందులో హారిక ఎక్కువ పాయింట్స్ గెలుచుకుంది.

అనంత‌రం నోయ‌ల్‌, కుమార్ సాయిలు జోక‌ర్‌లు డ్యాన్స్ చేయ‌గా అంద‌రు కుమార్ సాయి అద్భుతంగా చేశాడ‌ని చెప్పుకొచ్చారు. ఇక అఖిల్‌, లాస్య‌లు అమ్మ పాట‌కు అద్భుతంగా ప్ర‌ద‌ర్శన చేశారు. అయితే ఇందులో లాస్య ప‌ర్‌ఫార్మెన్స్ బాగుంద‌ని ఆమెను విన్న‌ర్‌గా ప్ర‌క‌టించారు. దీనికి సంబంధించిన డ్యాన్స్‌ని రాజ‌శేఖ‌ర్ మాస్ట‌ర్‌తోను చేయించారు నాగార్జున‌.

ఇక  క‌ళ్ల‌కు గంత‌లు కొట్టుకుని అవినాష్‌, అరియానా ఈక్వ‌ల్‌గా ప్ర‌ద‌ర్శ‌న చేశారు. అభిజిత్ ప్ర‌ద‌ర్శ‌న కొంచెం ఎక్కువ‌గా బాగున్న నేప‌థ్యంలో అతనిని మెచ్చుకున్నారు. ఇక సోహైల్, మోనాల్‌లు బెల్లీ డ్యాన్స్ చేయ‌గా ఇందులో సోహైల్ ఇన్వాల్ అయి చేశాడు. అత‌ని ప్ర‌ద‌ర్శ‌న‌కు నాగ్ కూడా ఇంప్రెస్ అయ్యారు. సింగ‌రేణి ముద్దుబిడ్డ కాలుతున్న బొగ్గు మీద చేసిన‌ట్లు ఉంద‌ని సోహైల్‌ను మెచ్చుకున్నారు. ఇక కుర్చీల‌నుప‌యోగించి డ్యాన్స్ చేయ‌డంలో దివి క‌న్నా మెహ‌బూబ్ అద్భుతంగా డ్యాన్స్ చేయ‌డంతో ఈ టాస్క్ అయిపోయింది.

ఫ‌న్ టాస్క్‌లు పూర్తైన త‌ర్వాత నామినేష‌న్‌లో ఉన్న అరియానా, అభిజిత్‌ల‌ని సేవ్ చేసిన నాగార్జున  మిగిలి ఉన్న కంటెస్టెంట్స్  కుమార్ సాయి, మోనాల్‌లో ఎవ‌రిని సేవ్ చేయాలునుకుంటున్నావ్ అని అడ‌గ‌గా, అరియానా.. కుమార్ సాయి పేరు చెప్పింది. అయితే నాగార్జున ఇద్ద‌రిని ల‌గేజ్ స‌ర్ధుకొని కన్ఫెష‌న్ రూంలోకి ర‌మ్మ‌ని చెప్ప‌డంతో మోనాల్ క‌న్నీటి ప‌ర్యంత‌మైంది. నాకు ఇక్క‌డ ఉండాల‌ని లేదు. నేను వెళ్ళిపోతా అంటూ ఏడ్చేసింది. కుమార్ సాయి మాత్రం తాను వెళ్ళిన కూడా హ్యాపీగా వెళ‌తానంటూ కన్ఫెష‌న్ రూంలోకి వ‌చ్చేశాడు. 

క‌న్ఫెష‌న్ రూంలోకి వ‌చ్చిన త‌ర్వాత మోనాల్‌, కుమార్ సాయిల‌లో కుమార్‌ని ఎలిమినేట్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు నాగార్జున‌. సంతోషంగానే బ‌య‌ట‌కు వ‌చ్చిన కుమార్ సాయికి ఆయన ప్రయాణాన్ని నాగార్జున మన టీవీలో వేసి చూపించారు. ఆ తరవాత కుమార్ సాయి మాట్లాడుతూ.. ‘‘హౌజ్‌లోకి వెళ్తున్నప్పుడు మూడు కోరికలతో వెళ్తున్నానని మీకు చెప్పాను. ఒకటి.. నేను గెలవాలని వచ్చాను. రెండు.. నేను బయటికి వెళ్లేటప్పటికి వ్యాక్సిన్ వచ్చి ఉండాలి. అది రాలేదు. మూడోది.. మీకు కథ చెప్తానని అన్నాను. మీరు ఎప్పుడైనా వినడానికి ఛాన్స్ ఇవ్వండి సార్’’ అని అన్నాడు. దీనికి నాగార్జున ఓకే చెప్పారు. ఇక కుమార్ సాయి ఆనందానికి అవధుల్లేవు. బిగ్ బాస్ టైటిల్ పొందినంత ఎంజాయ్ చేశాడు. 


logo