తన కన్నా చిన్న వాడైన అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‌ని వివాహం చేసుకున్న ప్రియాంక చోప్రా ప్రస్తుతం అతనితో సంతోషంగా ఉంది. ఈ ఇద్దరు ఎక్కడికి వెళ్లిన జంటగా వెళుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అయితే హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్, సంజయ్ దత్, మలైకా అరోరా, అమీర్ ఖాన్ మాదిరిగా ప్రియాంక కూడా కొద్ది రోజులలో విడాకులు తీసుకోనుందట. ఈ విషయాన్ని ప్రిడిక్ట్ చేశాడు. ప్రముఖ సినీ క్రిటిక్, బాలీవుడ్ నటుడు కమల్ ఆర్ ఖాన్.
ఇటీవల అమీర్ తన రెండవ భార్య కిరణ్ రావుకు 15 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత విడాకులు ఇస్తున్నట్లుగా ప్రకటించడంతో కమల్ ఆన్ ఖాన్ తన ట్విట్టర్లో అమీర్‌కు తన భార్య కళ్లజోడు మొహం బోర్ కొట్టిందని.. అందుకే విడాకులిచ్చాడని కమల్ ఆర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా “ప్రియాంకకు ఆమె భర్త నిక్ జోనస్ మరో 10 ఏళ్లలో విడాకులు ఇవ్వడం తథ్యం” అంటూ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశాడు కేఆర్కే. సైఫ్, కరీనాల సంతానానికి సరైన పేరు పెట్టనందను భవిష్యత్‌లో పెద్దగా రాణించలేరని ప్రిడిక్ట్ చేశాడు. అలానే బాలీవుడ్లో ఓ నటుడికి అతడి తండ్రి మరణించాకే సరైన గుర్తింపు దక్కుతుందని తెలిపాడు. అయితే ఆ నటుడెవరనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం కేఆర్కే కామెంట్స్ బీటౌన్‌లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.