1 నేనొక్కడినే సినిమాతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన కృతి సనన్ ఇప్పుడు ప్రభాస్ సరసన ఆదిపురుష్ చిత్రంలో నటిస్తుంది.సీత పాత్రలో కనిపించి సందడి చేసేందుకు సిద్ధమైన ఈ భామ మిమి అనే చిత్రంలోను టైటిల్ రోల్ పోషించారు. సరోగసీ ద్వారా బిడ్డను కనేందుకు సిద్ధపడి.. గర్భాన్ని అద్దెకు ఇచ్చిన అవివాహితకు ఎదురైన అనుభవాల సమాహారంగా తెరకెక్కిన చిత్రం ‘మిమీ’.
మిమీ చిత్రంలో గర్భవతిగా కనిపించేందుకు మిమీ 15 కేజీల బరువు పెరిగింది. ఇందులో తనదైన నటనతో ఆకట్టుకుంది. అయితే మిమీ కోసం 15 కేజీల బరువు పెరిగిన కృతి సినిమా షూటింగ్ పూర్తయ్యాక బరువు తగ్గేందుకు చాలా కష్టపడింది. తాను చేసిన హార్డ్ వర్క్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
మిమీ కోసం 15 కిలోలు పెరగడం ఒక సవాలు. ఈ చబ్బీ సనన్ అంత బరువు తగ్గడం కూడా అంతసులభమేమీ కాదు! 3 నెలల పాటు వర్కౌట్ లేదు. కనీసం యోగా కూడా చేయలేదు. నా స్టామీనా జీరో అయిపోయింది! ఇప్పుడు నెమ్మదిగా పూర్వరూపం సంతరించుకుంటోంది’’ అని తన ట్రాన్స్ఫర్మేషన్ జర్నీని పంచుకున్నారు. మిమీ చిత్రంలో పంకజ్ త్రిపాఠి ముఖ్య పాత్ర పోషించగా ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది.