మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Oct 18, 2020 , 09:53:56

ఆదిపురుష్‌లోకి మ‌హేష్ హీరోయిన్..!

ఆదిపురుష్‌లోకి మ‌హేష్ హీరోయిన్..!

బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ అదిపురుష్ అనే భారీ బ‌డ్జెట్ చిత్రం చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ప్యాన్ ఇండియా సినిమాగా రూపొంద‌నున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ళ‌నున్న‌ట్టు తెలుస్తుంది. నాగ్ అశ్విన్‌తో చేయబోతున్న సినిమాతో పాటు ఈ సినిమా షూటింగ్‌లో ప్ర‌భాస్ పాల్గొన‌నున్నాడ‌ని స‌మాచారం.  అయితే ఈ చిత్రంలో ప్ర‌భాస్ రాముడి పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌గా, బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ రావణుడి రోల్ పోషించబోతున్నారు. సీత పాత్ర‌లో ఎవ‌రు క‌నిపించ‌నున్నార‌ని కొన్నాళ్ళుగా చ‌ర్చ నడుస్తుంది. 

ఆదిపురుష్ చిత్రంలో క‌థానాయిక‌గా అనుష్క లేదా కియారా అద్వానీ, కీర్తి సురేష్‌ల‌లో ఒకరిని ఎంపిక చేయ‌నున్నార‌ని మొద‌ట్లో ప్ర‌చారం జ‌రిగిన‌ప్ప‌టికీ, తాజాగా కృతిస‌న‌న్ ఫ్రేమ్‌లోకి వ‌చ్చింది. 1 నేనొక్క‌డినే చిత్రంలో మ‌హేష్ స‌ర‌స‌న న‌టించిన కృతిస‌న‌న్‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు ఫైన‌ల్ చేసిన‌ట్టు టాక్. అంతేకాదు  ఆమెకు భారీ రెమ్మ్యూనరేషన్ కూడా ఆఫర్ చేశారట. ప్రభాస్ కెరీర్‌లో 22వ సినిమాగా రానున్న ఈ 'ఆదిపురుష్' మూవీని హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.  


logo