ఆదివారం 24 జనవరి 2021
Cinema - Nov 07, 2020 , 14:53:40

అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న కృతి క‌ర్భందా

అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న కృతి క‌ర్భందా

బ్రూస్ లీ ఫేం కృతి క‌ర్భందా అనారోగ్యానికి  గురైంది. మ‌లేరియా సోక‌డంతో ప్ర‌త్యేక చికిత్స తీసుకుంటున్న కృతి సోష‌ల్ మీడియా ద్వారా త‌న ఆరోగ్య ప‌రిస్థితిని వివ‌రించింది. 2020 సంవ‌త్స‌రం ఎన్నో అనుభ‌వాల‌ని, విష‌యాల‌ని నేర్పింది. మ‌లేరియా వ‌ల‌న నేను ప్ర‌స్తుతం ఇంటికే పరిమితం అయ్యాను. నా ఆరోగ్యం గురించి ఎలాంటి ఆందోళ‌న‌ల చెందాల్సిన అవ‌స‌రం లేదు. మ‌లేరియా నుండి ఇప్పుడిప్పుడే కొలుకుంటున్నా.

త్వ‌ర‌లోనే షూట్‌కి వెళ్ళాలి. నా గురించి, నా ఆరోగ్యం గురించి ఆందోళ చెందిన వారి కోసం ఈ లెట‌ర్ రాస్తున్నాను. నా పై ఎన‌లేని ప్రేమ కురిపిస్తూ, ఎప్పుడు అండ‌గా ఉంటున్న ప్ర‌తి ఒక్క‌రికి ధ‌న్య‌వాదాలు అంటూ కృతి లెట‌ర్‌లో ప‌లు విష‌యాలు చెప్పుకొచ్చింది. అంతేకాదు కొన్ని ఫ‌న్నీ మీమ్స్ పంపాలంటూ నెటిజ‌న్స్ ని కోరింది.

సుమంత్ హీరోగా 2009లో వచ్చిన బోణీ సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మ‌డు ఇటీవ‌ల   అక్షయ్ కుమార్‌, రితేష్ దేశ్ ముఖ్‌ల హౌజ్‌ఫుల్‌ 4 సినిమాలో నటించి  అల‌రించింది. ప్రస్తుతం జీ5 కోసం రెండు వెబ్ సిరీస్‌లు చేస్తోంది


logo