e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home News ఓకే అనేశావా ?

ఓకే అనేశావా ?

ఓకే అనేశావా ?

ఉప్పెన సినిమాతో తెలుగులోనే కాదు సౌత్ లో పాపులార్టీ అందుకుంది కృతిశెట్టి. సొట్టబొగ్గలతో..కొంటే చూపులతో కుర్రకారులో క్రేజీ అందుకున్న ఈ అమ్మడికి వరసగా ఆఫర్లు వస్తున్నాయి. అది కూడా స్టార్‌ హీరోల సినిమాలలో ఛాన్స్‌ రావడంతో కృతి యమ బీజీగా మారింది.

ప్రస్తుతం తెలుగులో రామ్‌ పోతినేని సినిమాలో, నాని శ్యామ్‌ సింగరాయ్‌, సుధీర్‌ బాబు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీల్లో నటిస్తోంది. ఇక ఇప్పుడు తమిళంలో ధనుష్‌ సరసన నటించే ఛాన్స్‌ అందుకుందట.

మారి, మారి 2 సినిమాలను తెరకెక్కించిన బాలాజీ మోహన్‌ డైరక్షన్ లో ధనుష్‌ ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో హీరోయిన్‌ గా కృతిశెట్టిని తీసుకోవాలని చిత్రయూనిట్‌ డిసైడ్‌ అయ్యిందట. కర్ణన్‌ సక్సెస్‌ తో జోష్‌ మీదున్న ధనుష్‌ తో కలిసి నటించే ఛాన్స్‌ వస్తే ఎవరు కాదంటారు. అమ్మడు కూడా ఓకే చెప్పిందని టాక్‌.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఓకే అనేశావా ?

ట్రెండింగ్‌

Advertisement