ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా స్టార్ డమ్ సంపాదించింది మంగళూరు భామ కృతిశెట్టి. ఈ సినిమా సక్సెస్ తో వరుస ఆఫర్లు ఈ బ్యూటీ తలుపు తట్టాయి. ప్రస్తుతం రామ్-లింగుస్వామి ప్రాజెక్టుతోపాటు పలు ఇంట్రెస్టింగ్ సినిమాలను లైన్ లో పెట్టింది కృతిశెట్టి. ఈ ఏడాది ప్రారంభంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఉప్పెన బాక్సాపీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇందులో కృతిశెట్టి పోషించిన బేబమ్మ పాత్ర తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండి పోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇప్పుడీ సక్సెస్ ఫుల్ చిత్రంపై బాలీవుడ్ మేకర్స్ దృష్టి పడ్డది. ఉప్పెనను హిందీలో రీమేక్ చేసేందుకు బాలీవుడ్ దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్టు బీటౌన్ లో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతోంది. ఒక వేళ రీమేక్ తెరరూపం దాలిస్తే హిందీ ప్రాజెక్టులో కూడా బేబమ్మ పాత్రలో కృతిశెట్టినే తీసుకుంటారని ఊహాగానాలు వస్తున్నాయి. మరి అన్నీ అనుకున్నట్టు కుదిరితే అందాల భామ కృతిశెట్టి బాలీవుడ్ తెరంగేట్రం చేసే టైం ఎంతో దూరంలో లేనట్టే కనిపిస్తోంది.
సైకిల్ తో సన్నీలియోన్.. స్టన్నింగ్ లుక్స్ వైరల్
100 సార్లు నన్ను రిజెక్ట్ చేశారు..వారికి నా సమాధానమదే: దివి
మా ఎన్నికలు..ప్రకాశ్ రాజ్ ప్రశ్నకు నరేశ్ సెటైరికల్ రిప్లై
నో ఓటీటీ..సిల్వర్ స్క్రీన్ పైనే ‘నారప్ప’ సందడి..!
ఈ వీకెండ్ నెట్ఫ్లిక్స్ లో వస్తున్న తెలుగు సినిమాలివే..!
బంగార్రాజు చిత్రంలో ‘బేబమ్మ’..?