సోమవారం 28 సెప్టెంబర్ 2020
Cinema - Aug 10, 2020 , 13:10:24

మా తాత‌గారు మృతి చెందారు: న‌టుడు కృష్ణుడు

మా తాత‌గారు మృతి చెందారు: న‌టుడు కృష్ణుడు

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో న‌టుడిగా కొన్ని సినిమాలు చేసిన‌ప్ప‌టికీ కెరీర్ అంత గొప్ప‌గా లేక‌పోవ‌డంతో నిర్మాత‌గా త‌న అదృష్టం ప‌రీక్షించుకుంటున్నాడు కృష్ణుడు.త‌న కూతురు పేరు మీద నిత్య క్రియేష‌న్స్ అనే నిర్మాణ సంస్థను లాంచ్ చేసి మై భాయ్ ఫ్రెండ్స్ గ‌ర్ల్ ఫ్రెండ్ అనే సినిమా చేస్తున్నాడు. దీనికి ప్ర‌భాస్ ప్ర‌చారం కూడా చేశారు. క‌ట్ చేస్తే కృష్ణుడు త‌న ట్విట్ట‌ర్ ద్వారా త‌న తాత వైసీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు (87) అనారోగ్యంతో విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ క‌న్నుమూసార‌ని ట్వీట్ చేశాడు. 

మా తాతగారు పెన్మత్స సాంబశివరాజుగారు ఈ రోజు మృతి చెందారు. ఉమ్మడి రాష్ట్రంలో 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నాయకుడాయన. సివిల్ సప్లయ్ మినిస్టర్, ట్రాన్స్‌ఫోర్ట్, సుగర్ ఇండస్ట్రీస్, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ మినిస్టర్ వంటి ఎన్నో పదవులను అలంక‌రించిన ఆయ‌న  ప్రజల సంక్షేమం కోసం ఎంతగానో పోరాడిన గొప్ప నాయకుడు..’’ అని కృష్ణుడు తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 


logo