గురువారం 29 అక్టోబర్ 2020
Cinema - Oct 08, 2020 , 10:31:57

సుధీర్ బాబు భార్య బ‌ర్త్‌డే వేడుక‌లో కృష్ణ‌,మ‌హేష్‌

సుధీర్ బాబు భార్య బ‌ర్త్‌డే వేడుక‌లో కృష్ణ‌,మ‌హేష్‌

టాలీవుడ్ హీరో సుధీర్ బాబు భార్య‌, కృష్ణ కూతురు ప‌ద్మినీ ప్రియ‌ద‌ర్శినీ పుట్టిన రోజు వేడుక బుధ‌వారం రోజు కుటుంబ స‌భ్యుల మ‌ధ్య ఘ‌నంగా జ‌రిగింది. ఈ బ‌ర్త్‌డే వేడుక‌కు సూప‌ర్ స్టార్ కృష్ణ‌, మ‌హేష్ బాబు, మంజుల‌, సుధీర్ బాబు, టీడీపీ ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ త‌‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. కుటుంబ స‌భ్యుల మ‌ధ్య ప్రియ కేక్ క‌ట్ చేసిన త‌ర్వాత అందరు క‌లిసి డైనింగ్ టేబుల్ వ‌ద్ద భోజనం ఆర‌గించారు. ఆ త‌ర్వాత కృష్ణ‌కు బైబై చెప్పి కారులో పంపారు.

సుధీర్ బాబు త‌న శ్రీమ‌తి బ‌ర్త్ డే వేడుక‌కు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ..   'ఆ తేదీ వచ్చింది.. నా ప్రేమ ఈ రోజే పుట్టింది. హ్యాపీ బర్త్‌ డే ప్రియ' అని సుధీర్ బాబు అని రాసాడు. ప్ర‌స్తుం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. చాలా కాలం త‌ర్వాత కృష్ణ ఫ్యామిలీ స‌భ్యులు అంద‌రిని ఒకే చోట చూసే స‌రికి ఫ్యాన్స్ థ్రిల్ అవుతున్నారు.


logo