మంగళవారం 11 ఆగస్టు 2020
Cinema - Jul 07, 2020 , 21:22:47

సురేందర్ రెడ్డి దర్శకుడు..క్రిష్ నిర్మాత..!

సురేందర్ రెడ్డి దర్శకుడు..క్రిష్ నిర్మాత..!

కొత్తదనంతో కూడిన కథలను తెరకెక్కించి డైరెక్టర్ గా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు క్రిష్ . ఈ దర్శకుడు ఇపుడు నిర్మాతగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడు. పీచర్ ఫిల్మ్స్ తోపాటు వెబ్ సిరీస్ లను నిర్మించే యోచనలో ఉన్నాడు. క్రిష్ కు సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది.

సైరా వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన సురేందర్ రెడ్డి తీస్తున్న కొత్త చిత్రాన్ని క్రిష్ నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ చిత్రంలో స్టార్ హీరో నటిస్తాడని సమాచారం. కృష్ణ అండ్ హిస్ లీలా చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రవికాంత్ పేరెపు తీస్తున్న కొత్త చిత్రాన్ని క్రిష్ నిర్మాతగా వ్యవహరించనున్నాడట.

ఇదిలా ఉంటే మరోవైపు పవన్ కల్యాణ్ తో కలిసి పీరియాడిక్ డ్రామా గా వస్తోన్న చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. క్రిష్ ఓ వైపు దర్శకుడిగా, మరోవైపు నిర్మాతగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎంత వరకు సక్సెస్ అవుతారో చూడాలి. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo