సోమవారం 25 జనవరి 2021
Cinema - Dec 05, 2020 , 00:25:04

క్రిష్‌ ‘కొండపొలం’?

క్రిష్‌ ‘కొండపొలం’?

వైష్ణవ్‌తేజ్‌ కథానాయకుడిగా క్రిష్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఏకధాటిగా జరిగిన షెడ్యూల్‌తో ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రాజీవ్‌ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబా నిర్మిస్తున్నారు. రకుల్‌ప్రీత్‌సింగ్‌ కథానాయిక. ‘కొండపొలం’ అనే నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు సమాచారం. తాజాగా ఈ సినిమాకు టైటిల్‌ను కూడా ‘కొండపొలం’గా నిర్ణయించబోతున్నారని తెలిసింది. కరువు పరిస్థితిల్లో పోషణ కోసం గొర్రెల మందను అడవిలోకి తీసుకుపోయిన ఓ బృందం అక్కడ ఎదుర్కొన్న పరిస్థితులు, అరణ్యం నేపథ్యంలో అవగతమయ్యే జీవన సత్యాలు నేపథ్యంలో ఈ చిత్ర కథ సాగుతుందని సమాచారం.


logo