సోమవారం 03 ఆగస్టు 2020
Cinema - Jul 13, 2020 , 10:50:20

ఓటీటీలో విడుద‌ల కానున్న క్రాక్..!

ఓటీటీలో విడుద‌ల కానున్న క్రాక్..!

క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల‌న సినిమా ప‌రిశ్ర‌మ స్తంభించి మూడు నెల‌ల పైనే అవుతుంది. కొన్ని సినిమా షూటింగ్స్ మ‌ధ్య‌లో ఆగిపోగా, మ‌రి కొన్ని చివ‌రి ద‌శ‌లో ఉన్నాయి. షూటింగ్ ఏదోలా పూర్తి చేసి రిలీజ్ చేద్దామంటే థియేట‌ర్స్ తెర‌వ‌ని ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో నిర్మాత‌లు త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతున్నారు. కొంద‌రు చేసేదేం లేక స్ట్రీమింగ్ ప్లాట్ ఫాంల‌లో రిలీజ్ చేస్తున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం ర‌వితేజ క్రాక్ కూడా ఓటీటీలో విడుద‌ల కానుంద‌ని అంటున్నారు.

రవితేజ, శృతిహాసన్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘క్రాక్‌'. గోపీచంద్‌ మలినేని దర్శకుడు. సరస్వతి ఫిల్మ్స్‌ డివిజన్‌ పతాకంపై బి. మధు నిర్మిస్తున్నారు.  ‘వాస్తవ ఘటనల స్ఫూర్తితో తెరకెక్కుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్ చిత్రంలో కుటుంబ విలువలకు ప్రాధాన్యముంటుంది. అన్యాయాల్ని ఎదురించే నిజాయితీపరుడైన పోలీస్‌ అధికారిగా రవితేజ కనిపించబోతున్నారు. ఇప్ప‌టికే విడుదలైన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌, టీజర్‌కు చక్కటి స్పందన ల‌భించింది. సముద్రఖని, వరలక్ష్మిశరత్‌కుమార్‌, దేవీప్రసాద్‌, పూజిత పొన్నాడ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం థ‌మ‌న్ అందిస్తున్నారు. ఈ సినిమని ఓటీటీలో విడుద‌ల చేసేందుకు గాను చర్చ‌లు జ‌రుపుతున్న‌ట్టు తాజా స‌మాచారం. అతి త్వ‌ర‌లోనే దీనిపై క్లారిటీ రానుంది.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo