మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Sep 03, 2020 , 23:48:57

వీరశంకర్‌ ‘పౌరుషం’

వీరశంకర్‌ ‘పౌరుషం’

రవితేజ కథానాయకుడిగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘క్రాక్‌'.  బి.మధు నిర్మాత. శృతిహాసన్‌ కథానాయిక. వరలక్ష్మీ శరత్‌కుమార్‌ కీలక పాత్రధారి. చిత్రీకరణ తుది దశకు చేరుకున్నది. చివరి  షెడ్యూల్‌ను త్వరలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  గురువారం చిత్రబృందం రవితేజ కొత్త పోస్టర్‌ను విడుదలచేసింది. ఖాకీచొక్కాతో మీసం మెలివేస్తూ పవర్‌ఫుల్‌ లుక్‌లో ఆయన కనిపిస్తున్నారు. ‘ఉభయ తెలుగు రాష్ర్టాల్లో జరిగిన  వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో పోలీస్‌ అధికారి వీరశంకర్‌గా రవితేజ కనిపించబోతున్నారు. చివరి  షెడ్యూల్‌ మినహా చిత్రీకరణ పూర్తయింది.  నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్నాయి’ అని చిత్రబృందం తెలిపింది. 


logo