బుధవారం 03 మార్చి 2021
Cinema - Jan 25, 2021 , 20:24:27

‘క్రాక్’ 15 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్..బొమ్మ బ్లాక్‌బస్టర్

‘క్రాక్’ 15 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్..బొమ్మ బ్లాక్‌బస్టర్

రవితేజ కెరీర్ చాలా రోజుల తర్వాత మళ్లీ ట్రాక్ ఎక్కింది. అది కూడా క్రాక్ సినిమాతో. బాక్సాఫీస్ దగ్గర ఈయన మోత మోగిస్తున్నాడు. ప్యాండమిక్ తర్వాత విడుదలై థియేటర్స్ లో సంచలన విజయం సాధించిన తొలి ఇండియన్ సినిమా ఇదే. 2017లో అనిల్ రావిపూడి తెరకెక్కించిన రాజా ది గ్రేట్ సినిమా దాదాపు 30 కోట్ల షేర్ వసూలు చేసింది. ఆ తర్వాత రవితేజ సినిమాలు ఏవి కూడా కనీసం 10 కోట్లు కూడా వసూలు చేయలేదు. టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు, అమర్ అక్బర్ ఆంటోనీ, డిస్కో రాజా సినిమాలు కనీసం 10 కోట్లు కూడా కలెక్ట్ చేయలేదు. దానికంటే లోపలే ఉండిపోయాయి. దాంతో రవితేజకు మళ్లీ క్యారెక్టర్స్ కరెక్ట్.. సైడ్ హీరో అయిపోవాల్సిందే అంటూ విమర్శలు కూడా మొదలయ్యాయి. 

ఇలాంటి సమయంలో వచ్చింది క్రాక్. సంక్రాంతి పండగంతా మాస్ రాజాలోనే కనిపిస్తుంది. ఈయన సినిమా 15 రోజుల్లో ఏకంగా 33 కోట్ల షేర్ వసూలు చేసింది. విడుదలైన వారం రోజుల్లోనే లాభాల బాట పట్టింది క్రాక్. జనవరి 29న క్రాక్ డిజిటల్ విడుదల కూడా కన్ఫర్మ్ చేసారు. దాంతో ఫుల్ రన్ కు దగ్గర వచ్చేసింది ఈ చిత్రం. 16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన క్రాక్.. ఇప్పటి వరకు 31 కోట్లు వసూలు చేసింది. గ్రాస్ దాదాపు 56 కోట్ల వరకు ఉంది. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ చిత్రం ముందు నుంచి కూడా పాజిటివ్ బజ్‌తోనే వచ్చింది. విడుదల సమయంలో కూడా కాస్త ఆలస్యం అయినా కూడా నైట్ షోస్ నుంచి రచ్చ మొదలైంది. మరి 15 రోజుల్లో ఎక్కడెక్కడ ఎంత వసూలు చేసిందో చూద్దాం.. 

క్రాక్ 15 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. 

నైజాం: 10.28Cr

సీడెడ్: 5.49Cr

ఉత్తరాంధ్ర: 3.80Cr

ఈస్ట్: 2.97Cr

వెస్ట్: 2.20Cr

గుంటూరు: 2.44Cr

కృష్ణా: 2.07Cr

నెల్లూరు: 1.58Cr

ఏపీ తెలంగాణ టోటల్: 30.83 కోట్లు (51.50 కోట్ల గ్రాస్)

కర్ణాటక+రెస్ట్ ఆఫ్ ఇండియా: 1.56 కోట్లు

ఓవర్సీస్: 73 లక్షలు 

మొత్తం: 33.12 కోట్లు (55.20 కోట్ల గ్రాస్)

ఇవి కూడా చ‌ద‌వండి..

పుష్ప స్పెష‌ల్ సాంగ్ లో 'బ్లాక్ రోజ్' బ్యూటీ?

శ్ర‌ద్దాదాస్ సొగ‌సు చూడ‌త‌ర‌మా

ఇండోనేషియాలో తెనాలి భామ షికారు

ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ప్ర‌క‌టించిన మేకర్స్

'స‌ర్కారు వారి పాట' ఖాతాలో స‌రికొత్త రికార్డ్

విజ‌య్ దేవ‌ర‌కొండ లైగ‌ర్ షూట్ షురూ ..వీడియో

హాట్ లుక్ లో సారా హొయ‌లు..ట్రెండింగ్‌లో స్టిల్స్

వ‌రుణ్‌ధ‌వ‌న్ వెడ్డింగ్‌కు తార‌‌లు..ఫొటోలు, వీడియో

మ‌హేశ్ బాబు స్కిన్ స్పెష‌లిస్ట్ ఈమెనే..!


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo