శనివారం 06 మార్చి 2021
Cinema - Jan 26, 2021 , 19:56:11

‘ఆచార్య’ టీజర్ అప్‌డేట్‌పై కొరటాల-చిరు మీమ్స్

‘ఆచార్య’ టీజర్ అప్‌డేట్‌పై కొరటాల-చిరు మీమ్స్

చిరంజీవి సినిమా వస్తుందంటే పండగ చేసుకుంటారు అభిమానులు. ఆయన సినిమా విడుదల అవుతుందంటే థియేటర్స్ ముందు పరిస్థితులు పండగ వాతావరణం తలపిస్తాయి. అలాంటి మెగాస్టార్ సినిమా అప్ డేట్స్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా చూస్తుంటారు. వాళ్ల కోసం దర్శక నిర్మాతలు కూడా చిరు సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ త్వరత్వరగా ఇస్తుంటారు. ఈ క్రమంలోనే లూసీఫర్ రీమేక్, వేదాళం రీమేక్ లకు సంబంధించిన అప్ డేట్స్ కూడా వరసగా వస్తున్నాయి. కానీ ప్రస్తుతం నటిస్తున్న ఆచార్య అప్ డేట్స్ మాత్రం రావడం లేదు. అసలే కొరటాల శివ సినిమాలు చాలా నెమ్మదిగా తెరకెక్కిస్తాడు. అలాంటిది కరోనాకు తోడు చిరు కూడా కొన్ని ప్రత్యేక కారణాలతో షూటింగ్ కు దూరంగా ఉండటంతో ఆచార్య మరింత ఆలస్యం అవుతూనే ఉన్నాడు. 2018 సమ్మర్ లో భరత్ అనే నేను సినిమా చేసిన కొరటాల శివ..ఇప్పటి వరకు మరో సినిమా విడుదల చేయలేదు. 

2020 లో వస్తుందనుకున్న ఆచార్య కాస్త 2021కి వాయిదా పడింది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్ తప్ప మరోటి విడుదల కాలేదు. ఇప్పటికే షూటింగ్ కూడా చివరిదశకు వచ్చేసింది. రామ్ చరణ్ కూడా ఈ మధ్యే సెట్‌లో అడుగు పెట్టడంతో ఫిబ్రవరి లోపే షూటింగ్ పూర్తి చేసి.. పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ వేగంగా పూర్తి చేసి మే 9న సినిమా విడుదల చేయాలని చూస్తున్నాడు దర్శకుడు కొరటాల శివ. ఇదంతా బాగానే ఉన్నా.. అసలైన అప్ డేట్స్ మాత్రం బయటికి రావడం లేదు. ఇప్పటి వరకు టీజర్ రిలీజ్ ఎప్పుడనేది చెప్పలేదు కొరటాల. న్యూ ఇయర్, సంక్రాంతికి వస్తుందని ఆశగా ఎదురు చూసిన అభిమానులకు నిరాశే మిగిలింది.

 దాంతో ఇప్పుడు సినిమా టీజర్ అప్ డేట్ గురించి చిన్న మీమ్ చేసారు కొరటాల, చిరంజీవి. ఈ మీమ్ చిరంజీవి, కొరటాల మాట్లాడుకుంటున్నట్లుగా ఉంది. ఏమయ్యా కొరటాల ఇప్పటి వరకు ఆచార్య టీజర్ లేదు.. అప్‌డేట్ లేదు. న్యూ ఇయర్‌కు వస్తుందనుకుంటే రాలేదు.. సంక్రాంతికి వస్తుందేమో అనుకుంటే అప్పుడు కూడా రాలేదు. నువ్వు చెప్తావా నన్ను లీక్ చేయమంటావా అంటూ వార్నింగ్ ఇచ్చినట్లుగా ఈ మీమ్ క్రియేట్ చేసారు. దానికి వెంటనే లేదు సర్.. జనవరి 27 ఉదయం ఫిక్స్ సర్.. టీజర్ రిలీజ్ డేట్ చెప్పేస్తాను సర్ అంటూ మాటిచ్చాడు. ఏదేమైనా కూడా ఆచార్య టీజర్ రిలీజ్ అప్‌డేట్ రావడంతో మెగాస్టార్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మరి ఈ టీజర్ ఎప్పుడు రానుందో.. అందులో చరణ్ ఉంటాడో లేదో చూడాలి.




ఇవి కూడా చ‌ద‌వండి..

తిరుమ‌ల‌లో త్రివ‌ర్ణ ప‌తాకంతో ఊర్వశి రౌటేలా..వీడియో

డైరెక్ట‌ర్ సాగ‌ర్ చంద్రనా లేదా త్రివిక్ర‌మా..? నెటిజ‌న్ల కామెంట్స్

కీర్తిసురేశ్ ఏడేళ్ల క‌ల నెర‌వేరింది..!

సెట్స్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. వీడియో వైర‌ల్

ర‌వితేజ బ‌ర్త్‌డే .. ఖిలాడి ఫ‌స్ట్ గ్లింప్స్ విడుద‌ల‌

కూలీ నెం 1 సాంగ్ కు శ్ర‌ద్దాదాస్ డ్యాన్స్..వీడియో

పుష్ప స్పెష‌ల్ సాంగ్ లో 'బ్లాక్ రోజ్' బ్యూటీ?

శ్ర‌ద్దాదాస్ సొగ‌సు చూడ‌త‌ర‌మా

ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ప్ర‌క‌టించిన మేకర్స్

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo