గురువారం 28 మే 2020
Cinema - May 18, 2020 , 08:03:02

ప్రేక్ష‌కుల స్పంద‌న మాకు ఆక్సీజ‌న్‌: ప‌్ర‌ముఖ నిర్మాత‌

ప్రేక్ష‌కుల స్పంద‌న మాకు ఆక్సీజ‌న్‌: ప‌్ర‌ముఖ నిర్మాత‌

క‌రోనా ఎఫెక్ట్ అన్నిరంగాల‌పై తీవ్రంగా చూపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా సినీ పరిశ్ర‌మ‌పై క‌రోనా ఎఫెక్ట్ చాలా ఉంది. ఇన్నాళ్ళు థియేట‌ర్స్‌కి ఫ్యామిలీతో వెళ్లి సినిమాలు చూసే ఆడియ‌న్స్ ఇప్పుడు ఇంట్లోనే ఉండి డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాంస్‌లో వీక్షించేందుకు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. ఇలాంటి నేప‌థ్యంలో ప‌లువురు ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్రేక్ష‌కుల‌ని థియేట‌ర్స్ వైపు ర‌ప్పించేందుకు వ్యూహాలు ర‌చిస్తున్నారు.

ఇప్ప‌టికే నాగ్ అశ్విన్..డ్రైవ్ ఇన్, మద్యం అనుమతి ఆలోచ‌న‌ల‌ని ప్ర‌జ‌ల ముందు ఉంచాడు. తాజాగా కోన వెంక‌ట్ థియేట‌ర్స్‌లో అనుభూతి ఎలా ఉంటుందో తెలియ‌జెప్పే ప్ర‌య‌త్నం చేశాడు. సినిమా ప‌రిశ్ర‌మ‌కి చెందిన వారందు క‌ష్ట‌న‌ష్టాల‌ని చ‌వి చూసిన వారే. అంద‌రం ఇండ‌స్ట్రీకి ఎంతో ఇష్టంతో వచ్చాం. మీరు థియేట‌ర్‌లో సినిమా చూసి స్పందించిన తీరు మాకు ఆక్సీజ‌న్‌లా ప‌ని చేస్తుంది.థియేట‌ర్స్‌లో సినిమా చూస్తే వ‌చ్చే థ్రిల్ ఏ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాంలలో రాదు. సినిమాని థియేట‌ర్‌లోనే చూడాలి అని కోన త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. ఆయ‌న అనుష్క న‌టించిన నిశ్శ‌బ్ధం చిత్రాన్నిటీజీ విశ్వప్రసాద్‌తో క‌లిసి నిర్మించారు. ఈ చిత్రంలో అనుష్క, మాధవన్, అంజలి, షాలినీ పాండే, మైఖేల్‌ మ్యాడసన్ ముఖ్య పాత్ర‌లు పోషించ‌గా, హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వ‌హించారు.


logo