యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్‌డే( మే 20) సందర్భంగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు జక్కన్న. కొద్ది సేపటి క్రితం మేకర్స్ ఇందుకు సంబంధించి అఫీషియల్ ప్రకటన చేశారు. రేపు ఉదయం 10 గంటలకు కొమురం భీం ముందుకు రానున్నాడు అంటూ ఓ పోస్టర్ రివీల్ చేశారు. ఈ పోస్టర్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా చేయడం ఖాయమని తెలుస్తుంది.
గత ఏడాది బర్త్ డే రోజు రామరాజు ఫర్ భీమ్ పేరుతో విడుదలయిన టీజర్ వచ్చిరాగానే రికార్డుల మోత మోగిస్తోంది. వాడు కనబడితే సముద్రాలు తడబడతాయి.. నిలబడితే సామ్రాజ్యాలు సాగిలపడతాయి.. అంటూ సాగే ఈ టిజర్లో ఎన్టీఆర్ లుక్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ టీజర్ బ్యాక్ వాయిస్‌లో ‘వాడు నా తమ్ముడు కొమరం భీమ్’ అని.. రామ్ చరణ్ చెప్పే డైలాగులు అందరినీ ఆసక్తికరంగా ఆకట్టుకున్నాయి. టీజర్ చివరలో ఎన్టీఆర్ ముస్లిం గెటప్‌లో కనిపించి సినిమాపై మరింత ఆసక్తి పెంచాడు.