శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Cinema - Sep 16, 2020 , 17:53:11

82ఏళ్ల వ‌య‌స్సులో విశాల్ తండ్రి ఫిట్‌నెస్ పాఠాలు..వీడియో

82ఏళ్ల వ‌య‌స్సులో విశాల్ తండ్రి ఫిట్‌నెస్ పాఠాలు..వీడియో

కోలీవుడ్ హీరో విశాల్ తండ్రి జీకే రెడ్డికి క‌రోనా పాజిటివ్ గా నిర్దార‌ణ అయిన సంగ‌తి తెలిసిందే. అయితే 82ఏండ్ల వ‌యస్సులో జీకేరెడ్డి మానసిక స్థైర్యంతో క‌రోనాను జ‌యించారు. తాజాగా జీకే రెడ్డి చాలా యాక్టివ్ గా, ఉత్సాహంగా ఉన్న వీడియో ఒక‌టి షేర్ చేశారు. ఎనిమిది ప‌దుల వ‌య‌స్సులోనూ ఫిట్ నెస్ పాఠాలు చెప్పారు. ట్రైన‌ర్ల సూచ‌న‌లు, స‌ల‌హాల‌తో కొన్ని టిప్స్ ను అంద‌రితో పంచుకున్నారు. ఎలివేటెడ్ ప్లాంక్‌, బేసిక్ స్కాట్, ప్యార్ ల్ స్కాట్‌, బేసిక్ ప్లాంక్‌, సింగిల్ లెగ్ రేజ్ ఇలా కొన్ని వ్యాయ‌మా మెల‌కువ‌లు చేసి చూపించారు.

ఇంట్లోనే  ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండేందుకు చిన్న చిట్కాల‌ను పాటించాల‌ని సూచిస్తూ..ఫిట్ నెస్ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. జీకే రెడ్డి ఫిట్ నెస్ ఛాలెంజ్ వీడియో ఇపుడు సోష‌ల్ మీడియాలో అంద‌రినీ ఆక‌ర్షిస్తోంది.లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo