సైరా, ఉప్పెన సినిమాలతో తెలుగులోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ( Vijay Sethupathi ). ఉప్పెన చిత్రంలో విజయ్ సేతుపతి పోషించిన రాయనమ్ పాత్రకు అద్బుతమైన స్పందన వచ్చింది. ఈ స్టార్ హీరోతో పలువురు తెలుగు ఫిల్మ్ మేకర్స్ చర్చలు జరుపుతున్నట్టు టాక్ నడుస్తోంది. త్వరలోనే విజయ్ సేతుపతి పలు సినిమాలతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడట. అయితే ఈ స్టార్ ఓ తెలుగు సినిమా ( Telugu cinema )కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది.
ది ఫ్యామిలీ మ్యాన్ మేకర్స్ రాజ్-డీకే ఈ చిత్రాన్ని సమర్పించనున్నారు. యువ హీరో సందీప్ కిషన్ లీడ్ రోల్లో నటించనున్నాడు. తాజా టాక్ ప్రకారం విజయ్ సేతుపతి మరోసారి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్టు ఇన్ సైడ్ టాక్. దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఒక్కటే పెండింగ్ లో ఉందట. భరత్ చౌదరి (డెబ్యూ) దర్శకత్వం వహించనున్న ఈ ప్రాజెక్టుకు రంజిత్ జెల్కోడి నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఈ క్రేజీ అప్ డేట్ గురించి విజయ్ సేతుపతి ఏమైనా స్పందిస్తాడేమో చూడాలి.
ఇవి కూడా చదవండి..
‘ఎవరు మీలో కోటీశ్వరులు’ న్యూ ప్రోమో.. ఆగస్ట్ నుండి ప్రారంభం
దీపిక గర్భవతి అంటూ ప్రచారం.. వాస్తవమెంత?
అసిస్టెంట్ డైరెక్టర్ గా బిగ్ బాస్ బ్యూటీ
షూటింగ్స్ తో ఢిల్లీ భామ బిజీ షెడ్యూల్..!
తరుణ్, ఉదయ్కిరణ్తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..