బుధవారం 03 మార్చి 2021
Cinema - Jan 25, 2021 , 21:18:53

అభిమాని పెళ్లిలో సూర్య..ఆనందంలో వధూవరులు..!

అభిమాని పెళ్లిలో సూర్య..ఆనందంలో వధూవరులు..!

తమిళ ఇండస్ట్రీలోనే కాదు తెలుగులో కూడా సూర్యకు చాలా మంది అభిమానులున్నారు. అల్లు శిరీష్ లాంటి హీరోలు సూర్యకు అతిపెద్ద ఫ్యాన్స్. కొన్నేళ్లుగా సరైన హిట్ లేని సూర్య.. ఈ మధ్యే ఆకాశం నీ హద్దురాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఈ సినిమా తర్వాత సూర్య ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు కాలర్ ఎగరేసుకున్నారు. మరోవైపు తానింత పెద్ద హీరో కావడానికి దోహదం చేసిన అభిమానులను ఎప్పుడూ సొంత వాళ్లలాగే చూస్తుంటాడు సూర్య. ఆయన తమ్ముడు కార్తి కూడా అంతే. ఈ అన్నాదమ్ములకు అభిమానులు అంటే ప్రాణం. వాళ్ల కోసం ఎంత దూరం అయినా వెళ్తుంటారు. వాళ్లకు కష్టమొస్తే పెద్ద కొడుకులా ముందుంటారు. 


ఇప్పుడు కూడా ఓ అభిమానికి సూర్య షాక్ ఇచ్చాడు. ఆయన పెళ్లికి వెళ్లి మాటల్లో చెప్పలేని ఆనందం అందించాడు. ఆల్ ఇండియా సూర్య ఫ్యాన్‌ క్లబ్‌ సభ్యుడు హరికి పెళ్లి కుదిరిందనే విషయం తెలుసుకుని ఆయన పెళ్లికి వెళ్లాడు సూర్య. అభిమాన హీరో వచ్చాడనే విషయం తెలుసుకున్న హరి.. కాళ్లు నేలమీద నిలబడలేదు. తన పెళ్లి జరుగుతున్న విషయం కూడా మరిచిపోయి గాల్లో తేలిపోయాడు సదరు అభిమాని. వివాహ సమయానికి పెళ్లి మండపానికి చేరుకుని వధువు మెడలో కట్టే తాళి బొట్టును స్వయంగా తన చేతులతో పెళ్లి కొడుకుకి అందించాడు. ఆ తర్వాత వధూవరుల కుటుంబ సభ్యులతో పాటు నిల్చొని పెళ్లి తంతును దగ్గరుండి జరిపించాడు. 


మీ కొత్త జీవితం అందంగా ఉండాలని.. మీ ప్రయాణం నిండు నూరేళ్లు హాయిగా సాగాలని మనసారా ఆశీర్వదించాడు సూర్య. అంత బిజీ షెడ్యూల్‌లో కూడా అభిమాని పెళ్లి గుర్తు పెట్టుకుని మరీ వచ్చిన సూర్యను చూసి అంతా షాక్ అయ్యారు.. ప్రశంసలతో ముంచెత్తారు. పెళ్లి మండపంలో సూర్య సందడి చేసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మధ్యే ఆకాశం నీ హద్దురా సినిమాతో వచ్చిన ఈయన.. ఇప్పుడు గౌతమ్‌ మీనన్‌ 'నవరస' షార్ట్‌ ఫిల్మ్‌లోనూ నటిస్తున్నాడు. 9 కథలుండే ఈ చిత్రాన్ని 9 మంది దర్శకులు డైరెక్ట్‌ చేస్తున్నారు. వీళ్లందరూ ఈ చిత్రానికి ఒక్క పైసా తీసుకోకపోవడం విశేషం. నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన తర్వాత వచ్చే లాభాలను అంతా పంచుకోనున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

కూలీ నెం 1 సాంగ్ కు శ్ర‌ద్దాదాస్ డ్యాన్స్..వీడియో

పుష్ప స్పెష‌ల్ సాంగ్ లో 'బ్లాక్ రోజ్' బ్యూటీ?

శ్ర‌ద్దాదాస్ సొగ‌సు చూడ‌త‌ర‌మా

ఇండోనేషియాలో తెనాలి భామ షికారు

ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ప్ర‌క‌టించిన మేకర్స్

'స‌ర్కారు వారి పాట' ఖాతాలో స‌రికొత్త రికార్డ్

రజినీకాంత్ 'అన్నాత్తే' రిలీజ్ డేట్ ఫిక్స్..!

విజ‌య్ దేవ‌ర‌కొండ లైగ‌ర్ షూట్ షురూ ..వీడియో

హాట్ లుక్ లో సారా హొయ‌లు..ట్రెండింగ్‌లో స్టిల్స్

వ‌రుణ్‌ధ‌వ‌న్ వెడ్డింగ్‌కు తార‌‌లు..ఫొటోలు, వీడియో

మ‌హేశ్ బాబు స్కిన్ స్పెష‌లిస్ట్ ఈమెనే..!

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo