శనివారం 16 జనవరి 2021
Cinema - Dec 01, 2020 , 20:52:55

లాభం చిత్ర‌యూనిట్ తో విజ‌య్ సేతుప‌తి సెల్ఫీ

లాభం చిత్ర‌యూనిట్ తో విజ‌య్ సేతుప‌తి సెల్ఫీ

కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి హీరోగా న‌టిస్తోన్న లాభం. ఎస్పీ జ‌న‌నాథ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. శృతిహాస‌న్  హీరోయిన్ గా న‌టిస్తోండ‌గా..జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. లాభం సినిమా షూటింగ్ పూర్త‌యింది. ఈ సంద‌ర్బంగా లొకేష‌న్ లో విజ‌య్ సేతుప‌తి చిత్ర‌యూనిట్ స‌భ్యుల‌తో దిగిన ఫొటో ఇపుడు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. లాభం చిత్ర‌యూనిట్ అంతా క‌లిసి దిగిన స్టిల్ ను బీఏ రాజు ట్విట‌ర్ లో షేర్ చేశారు.

తెలుగులో బుచ్చిబాబు సాన డైరెక్ష‌న్ లో వైష్ణ‌వ్ తేజ్ హీరోగా న‌టిస్తోన్న ఉప్పెన మూవీలో విజ‌య్ సేతుప‌తి విల‌న్ గా న‌టిస్తున్నాడు. అమీర్‌ఖాన్ హీరోగా న‌టిస్తోన్న లాల్ సింగ్ చ‌ధా చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తున్నాడు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.