శనివారం 27 ఫిబ్రవరి 2021
Cinema - Jan 22, 2021 , 14:21:51

సూర్య స్ట్రెయిట్ తెలుగు సినిమా..బోయ‌పాటి డైరెక్ట‌ర్..!

సూర్య స్ట్రెయిట్ తెలుగు సినిమా..బోయ‌పాటి డైరెక్ట‌ర్..!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. త‌మిళంతోపాటు తెలుగులోనూ చాలా మంది ఫ్యాన్ ఫాలోవ‌ర్స్ ను సంపాదించుకున్నాడు. అయితే ఈ స్టార్ యాక్ట‌ర్ ఇప్ప‌టివ‌ర‌కు స్ట్రెయిట్ తెలుగు చిత్రంలో న‌టించ‌లేదు. తెలుగులో సినిమా చేసేందుకు స‌రైన డైరెక్ట‌ర్ కోసం ఎదురుచూస్తున్న సూర్య కోసం బోయ‌పాటి శ్రీను యాక్ష‌న్ ప్యాక్‌డ్ స్క్రిప్ట్ రెడీ చేశాడ‌ని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల్లో టాక్ వినిపిస్తోంది. బోయ‌పాటి ఈ క‌థ‌ను తొలుత ప్ర‌భాస్ కోసం సిద్దం చేసుకోగా..ఇపుడు సూర్య చేతుల్లోకి ఈ ప్రాజెక్టు తీసుకెళ్లాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

ప్ర‌స్తుతం బోయ‌పాటి, బాల‌కృష్ణ‌తో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిఇందే. బాల‌య్య సినిమా విడుద‌లైన త‌ర్వాత వ‌చ్చిన ఫ‌లితాన్ని బ‌ట్టి సూర్య డైరెక్ట‌ర్ బోయపాటితో సినిమాను అనౌన్స్ చేస్తాడేమోనంటూ ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. సూర్య‌తో తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాల‌నుకుంటున్నాడ‌ట బోయ‌పాటి. మ‌రి ఈ క్రేజీ కాంబినేష‌న్ తెర‌పైకి వ‌స్తుందా..? లేదా అనేది తెలియాలంటే మ‌రికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.

ఇవి కూడా చ‌ద‌వండి..

ఈ శుక్రవారం కొత్త సినిమా రిలీజ్‌లు లేవు..కార‌ణ‌మేంటో ?

మ‌హేశ్ దుబాయ్ ట్రిప్ వెనుకున్న సీక్రెట్ ఇదే..!

స‌మంతలా పూజాహెగ్డే హ్యాట్రిక్ కొట్ట‌నుందా..?

చిరంజీవి ఆ రీమేక్ ను ప‌క్క‌న పెట్టాడా..?

పాయ‌ల్ రాజ్‌పుత్‌.. ఈ ముద్దుల క‌హానీ ఏంటి?

రజినీకాంత్ అనూహ్య నిర్ణయం..ఆందోళనలో ఫ్యాన్స్..!


సూర్య సినిమాకు అవమానం జ‌రిగిందా..!


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo