ఆదివారం 01 నవంబర్ 2020
Cinema - Sep 19, 2020 , 16:38:41

రైతుల‌కు అండ‌గా స్టార్ హీరో..కాలువ ప‌నులు పూర్తి

రైతుల‌కు అండ‌గా స్టార్ హీరో..కాలువ ప‌నులు పూర్తి

కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య‌, కార్తీ ఓ వైపు త‌మ సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూనే..మ‌రోవైపు త‌మ వంతు సామాజిక బాధ్య‌త‌ను నిర్వ‌ర్తిస్తుంటార‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. సూర్య ఇప్ప‌టికే అగ‌ర‌మ్ ఫౌండేష‌న్ ద్వారా పేద‌ప్ర‌జ‌ల‌కు సాయంగా ఉంటూ, రాష్ట్ర‌వ్యాప్తంగా పేద విద్యార్థుల‌కు విద్యారంగంలో మంచి మార్పులు తీసుకువ‌చ్చేలా కృషి చేస్తున్నాడు. ఇపుడు కార్తీ రైతులు, గ్రామ‌స్థుల కోసం తీసుకున్న‌నిర్ణ‌యం ఎంతోమంది స్పూర్తిదాయ‌కంగా నిలుస్తోంది.

ఉజావ‌న్ ఫౌండేష‌న్, అంఫెనోల్ ఓమ్నీ కనెక‌ట్్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ స‌హకారంతో తిరున‌ల్వేలి జిల్లాలో 13 కిలోమీటర్ల‌ మేర సూర‌వ‌ళి కాలువ‌కు మ‌రమ్మ‌త్తు ప‌నులు చేయించాడు. ఈ కాలువ ద్వారా 8 చెరువులు, కుంట‌ల‌కు సాగునీరు నిండి సాగునీరు అందుబాటులోకి రానుంది. దీంతో సుమారు 10వేల ఎక‌రాల్లో పంట‌లు పండించుకోవ‌చ్చు. 10 గ్రామాల‌కు నీటి స‌మ‌స్య తీర‌నుంది. రూ.4 ల‌క్ష‌ల ఖ‌ర్చుతో కాలువ మ‌రమ్మ‌త్తు ప‌నులు కేవ‌లం 21 రోజుల్లో పూర్తి చేయ‌డం విశేషం. చిన‌బాబు చిత్రంలో రైతుగా క‌నిపించి అల‌రించిన కార్తీ..ఇపుడు రియ‌ల్ లైఫ్ ఫార్మ‌ర్ గా అంద‌రికీ ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.