గురువారం 21 జనవరి 2021
Cinema - Dec 01, 2020 , 16:06:18

స్టార్ డైరెక్ట‌ర్ హాలీవుడ్ చిత్రం..!

స్టార్ డైరెక్ట‌ర్ హాలీవుడ్ చిత్రం..!

తెలుగు, త‌మిళం, హిందీ ఏ భాష‌లోనైనా ప్రేక్ష‌కుల అభిరుచికి త‌గ్గ‌ట్టుగా సినిమాలు తీసే డైరెక్ట‌ర్ల‌లో ముందు వ‌రుస‌లో ఉంటాడు కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ ఏఆర్ మురుగ‌దాస్‌. ఇప్ప‌టివ‌ర‌కు ఇండియ‌న్ ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన మురుగ‌దాస్ ఇపుడు హాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను కూడా ప‌లుక‌రించేందుకు సిద్ద‌మ‌వుతున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది. హాలీవుడ్ స్టూడియో డిస్నీ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై ఓ హాలీవుడ్ సినిమా చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు ఇన్ సైడ్ టాక్‌.

జంగిల్ బుక్‌, ది బ్యూటీ అండ్ ది బీస్ట్ వంటి సినిమా జోన‌ర్ లో యాక్షన్ క‌మ్ యానిమేష‌న్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమాను తెర‌కెక్కించేందుకు సన్నాహాలు చేసుత‌న్న‌ట్టు స‌మాచారం. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే. మురుగ‌దాస్ ఇటీవ‌లే స్టార్ హీరో విజ‌య్‌తో 65వ సినిమా కోసం చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్టు వార్త‌లు రాగా..కొన్ని క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ కార‌ణంగా ప్రాజెక్టునుంచి వైదొలిగిన  సంగ‌తి తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo