శనివారం 23 జనవరి 2021
Cinema - Nov 06, 2020 , 16:08:34

14 ఏండ్ల త‌ర్వాత సిల్వ‌ర్ స్క్రీన్‌పై స్టార్ క‌పుల్‌..!

14 ఏండ్ల త‌ర్వాత సిల్వ‌ర్ స్క్రీన్‌పై స్టార్ క‌పుల్‌..!

కోలీవుడ్ స్టార్ కపుల్ సూర్య‌-జ్యోతిక పెళ్లికి ముందు సిల్వ‌ర్ స్క్రీన్ పై 7 చిత్రాల్లో న‌టించిన విష‌యం తెలిసిందే. ఈ ఇద్ద‌రూ సెల‌బ్రిటీలు త‌మ అభిమానుల‌ను అల‌రించారు. అయితే పెళ్లి త‌ర్వాత మాత్రం ఒక్క‌సినిమా కూడా చేయ‌లేదు. అయితే సూర్య-జ్యోతిక‌ను బిగ్ స్క్రీన్ పై చూడాల‌నుకుంటున్న  అభిమానులను గుడ్ న్యూస్. 2006లో వివాహం త‌ర్వాత మ‌రే సినిమా క‌లిసి చేయ‌ని ఈ స్టార్ క‌పుల్ 14 సంవ‌త్స‌రాల త‌ర్వాత సంద‌డి చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్ర‌ముఖ మ‌ల‌యాళ ద‌ర్శ‌కురాలు బెంగ‌ళూరు డేస్ ఫేం అంజ‌లీ 

మీన‌న్ ఈ క్రేజీ ప్రాజెక్టును ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నారు. అంజ‌లీ మీన‌న్ త‌మిళ డైరెక్ట‌ర్ హ‌లిత ష‌మీమ్ తో క‌లిసి క‌థ‌ను సిద్దం చేసే ప‌నిలో ఉన్నార‌ని కోలీవుడ్ వ‌ర్గాల టాక్‌. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు మ‌రికొన్ని రోజుల్లో తెలియ‌నున్నాయి. సూర్య హీరోగా న‌టించిన ఆకాశ‌మే నీ హ‌ద్దురా చిత్రం విడుద‌ల సిద్దంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. సుధ కొంగ‌ర ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo