దక్షిణాది సినీ పరిశ్రమలో ఉన్న బెస్ట్ యాక్టర్లలో ఒకరు విజయ్ సేతుపతి (Vijay Sethupathi). సూపర్ డీలక్స్ తో విజయ్ సేతుపతి వివిధ భాషల్లో కూడా పాపులారిటీ సంపాదించాడు. అంతేకాదు ఈ స్టార్ హీరో ఉప్పెన, సైరా చిత్రాలతో తెలుగులో సక్సెస్ పుల్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రేజీ యాక్టర్ నందమూరి కాంపౌండ్ లోకి ఎంటరయ్యాడన్న వార్త ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. తాజా అప్ డేట్ ఏంటంటే (Gopichand Malineni) గోపీచంద్ మలినేని-బాలకృష్ణ (Balakrishna) కాంబోలో సినిమా వస్తుంది కదా.
ఈ చిత్రంలో నెగెటివ్ రోల్ కోసం విజయ్ సేతుపతిని ఒప్పించాడట గోపీచంద్ మలినేని. ఇప్పటికే క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రలో నెగెటివ్ రోల్ లో కనిపించిన వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. కాగా ఇపుడు హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న బాలయ్య 107వ ప్రాజెక్టులో విజయ్ సేతుపతి జాయిన్ కాబోతున్నాడన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది.
మక్కల్ సెల్వన్ బాలకృష్ణ సినిమా చేస్తున్న విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ మూవీలో ఫీమేల్ లీడ్ రోల్స్ ఎవరు పోషిస్తారనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్. కాగా ఈ ప్రాజెక్టు షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది.
ఇవి కూడా చదవండి..
Nayanthara Engagement| ఎంగేజ్మెంట్ అయిపోందని చెప్పిన నయనతార
Vijayendraprasad on RGV| ఆ ఆర్జీవీ ‘కనబడుటలేదు’.. విజయేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్
Mahesh Babu| స్టార్ డైరెక్టర్ కొడుకు మహేశ్ బాబుకు వీరాభిమాని అట..!