బుధవారం 20 జనవరి 2021
Cinema - Nov 26, 2020 , 20:50:50

దీపికాపదుకొనే పాత్ర‌లో త్రిష‌..!

దీపికాపదుకొనే పాత్ర‌లో త్రిష‌..!

బాలీవుడ్ స్టార్లు అమితాబ్ బ‌చ్చన్, ఇర్ఫాన్ ఖాన్‌, దీపికా ప‌దుకొనే కాంబినేష‌న్‌లో వ‌చ్చిన చిత్రం పికు. ఈ మూవీ బాక్సాపీస్ వ‌ద్ద మంచి టాక్ తెచ్చుకుంది. కొన్నాళ్లుగా ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాల‌పై ఫోక‌స్ పెట్టింది కోలీవుడ్ బ్యూటీ త్రిష‌. ఈ భామ క‌న్ను పికు రీమేక్‌పై ప‌డింది. పికు త‌మిళ రీమేక్ లో దీపికాప‌దుకొనే పాత్ర‌లో త్రిష న‌టించనుంది. ప్ర‌ముఖ త‌మిళ నిర్మాత ఒక‌రు రీమేక్ రైట్స్ ను కొనుగోలు చేసిన‌ట్టు తెలుస్తోంది. హిందీలో అమితాబ్ బ‌చ్చ‌న్ పోషించిన పాత్ర‌ను స్టార్ హీరో పోషిస్తాడ‌ని టాక్ న‌డుస్తోంది.

మ‌రి త్రిష తో క‌లిసి న‌టించే ఆ వ్య‌క్తి ఎవ‌ర‌నేది రానున్న రోజుల్లో తెలియ‌నుంది. రీమేక్ సినిమా త్రిష అండ్ టీం చాలా ఎక్జ‌యిటింగ్ ఉంద‌ట‌. ఈ అమ్మడు ప్ర‌స్తుతం త‌మిళ సినిమాల‌పైనై ఫోక‌స్ పెట్టింది. కొన్ని సినిమాల షూటింగ్ పూర్త‌వ‌గా..మ‌రికొన్ని నిర్మాణ ద‌శ‌లో ఉన్నాయి.
లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo