బుధవారం 03 మార్చి 2021
Cinema - Jan 15, 2021 , 12:02:35

మ‌రో క్రేజీ ప్రాజెక్టులో స‌ముద్ర‌ఖ‌ని..!

మ‌రో క్రేజీ ప్రాజెక్టులో స‌ముద్ర‌ఖ‌ని..!

స‌ముద్రఖని..కొన్నాళ్లుగా తెలుగు ఫిలిం ఇండ‌స్ట్రీలో ఈ పేరు త‌ర‌చుగా వినిపిస్తూనే ఉంది. ఈ కోలీవుడ్ డైరెక్ట‌ర్ కమ్ యాక్ట‌ర్..ఇపుడు త‌న‌లోని న‌ట‌నా ప్ర‌తిభ‌ను రోజురోజుకీ ప్రూవ్ చేసుకుంటూ ముందుకెళ్లే ప‌నిలో ప‌డ్డాడు. 2020లో అల వైకుంఠ‌పురం చిత్రంతో సంక్రాంతి హిట్‌, 2021లో క్రాక్ సినిమాతో మ‌రో సంక్రాంతి హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు స‌ముద్ర‌ఖ‌ని. ఈ రెండు చిత్రాలు న‌టుడిగా స‌ముద్ర‌ఖ‌నిని మ‌రోస్థాయికి తీసుకెళ్లాయ‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు.

ఈ న‌టుడికి ఇపుడు ప్ర‌తిష్టాత్మ‌క ప్రాజెక్టులో న‌టించే అవ‌కాశాలు వెతుక్కుంటూ మ‌రీ వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే ఎస్ఎస్ రాజ‌మౌళి డైరెక్ట్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ లో న‌టిస్తున్నాడు. ఇపుడు మ‌రే క్రేజీ మూవీలో న‌టించే ఛాన్స్ కొట్టేశాడు. క్రాక్ ప్ర‌మోష‌న్స్ లో స‌ముద్ర‌ఖ‌ని మాట్లాడుతూ..ప‌వ‌న్ క‌ల్యాణ్-రానా కాంబినేష‌న్ లో వ‌స్తున్న అయ్య‌ప్ప‌నుమ్ కొషియుమ్ రీమేక్ లో ఓ పాత్ర చేస్తున్నాన‌ని చెప్పాడు. సినిమాలో నా క్యారెక్ట‌ర్ గురించి అంత‌గా తెలియదు.

త్రివిక్ర‌మ్ నాకు ఫోన్ చేసి సినిమాలో నీకోసం ఓ మంచి పాత్ర డిజైన్ చేశాన‌ని చెప్పార‌ని స‌ముద్ర‌ఖ‌ని చెప్పుకొచ్చాడు. సాగ‌ర్ చంద్ర డైరెక్ట్ చేస్తుండ‌గా..త్రివిక్ర‌మ్ ప‌ర్య‌వేక్ష‌ణ బాధ్య‌త‌లు చూస్తున్న‌ట్టు ఇప్ప‌టికే వార్త‌లు వ‌చ్చాయి. ప‌వ‌న్ కు ఈ సినిమా చేయాల‌న్న విష‌యాన్ని త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ సూచించిన విష‌యం తెలిసిందే.

ఇవి కూడా చ‌ద‌వండి

జాక్వెలిన్ పోజుల‌కు ఇంటర్ నెట్ షేక్..ఫొటోలు వైర‌ల్‌

ఒకే ఫ్రేమ్‌లో 'వ‌రుడు కావ‌లెను' ఫ్యామిలీ

మంచులో వ‌ణుకుతూ 'న‌దిలా న‌దిలా' మేకింగ్ వీడియో

ఆర్ఆర్ఆర్ లో సముద్ర‌ఖనికి ఛాన్స్ ఎలా వ‌చ్చిందంటే..?

బాలీవుడ్ సినిమాపై రామ్ క్లారిటీ..!

జాన్వీ క‌పూర్ షూటింగ్‌ను అడ్డుకున్న రైతులు

ప్ర‌భాస్ ' స‌లార్' కు ముహూర్తం ఫిక్స్

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo