శనివారం 27 ఫిబ్రవరి 2021
Cinema - Jan 20, 2021 , 19:40:15

అతడు ఇడ్లీ పెట్టాడు..అజిత్ లక్షలు ఇచ్చాడు..!

అతడు ఇడ్లీ పెట్టాడు..అజిత్ లక్షలు ఇచ్చాడు..!

సినిమాల్లో హీరోలంటే మంచి వాళ్లు..దేవుడి కంటే గొప్పవాళ్లు. ఏం కావాలంటే అలా చేస్తారు.. ఏది కావాలంటే అది ఇస్తుంటారు. అవసరం అనుకుంటే తన వాళ్ల కోసం ఆస్తులు కూడా వదిలేస్తారు.. ఇంకా మాట్లాడితే ప్రాణాలు కూడా లెక్క చేయరు. కానీ అలాంటి హీరోలు సినిమాల్లో మాత్రమే ఉంటారు. నిజంగా మాత్రం అలాంటి హీరోలు చాలా తక్కువగా ఉంటారు. అలాంటి వాళ్ళలో అజిత్ కూడా ఉంటాడు. తన వాళ్ల కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు తమిళ స్టార్ హీరో అజిత్. ఓసారి టెక్నీషియన్స్, డ్రైవర్స్ కు నిర్మాతలు చాలా కాలంగా డబ్బులు ఇవ్వకపోతే.. వాళ్లు వెళ్లి అతడికి కంప్లైంట్ చేసారు. దానికి తననేం చేయమంటారు.. వెళ్లి నిర్మాతను అడగండి అంటూ అక్కడ వాళ్ల దగ్గర సమాధానం చెప్పాడు అజిత్. 

అదేంటి అలా అన్నాడు అనుకుని పనికి వెళ్లిన వాళ్ళకు.. అజిత్ షాక్ ఇచ్చాడు. షూటింగ్ నుంచి ఉన్నట్లుండి వెళ్లిపోయి.. వాళ్ల బకాయీలు తీర్చిన తర్వాత వస్తానని చెప్పాడు అజిత్. అలా అందరికీ ఒకేసారి డబ్బులు ఇప్పించాడు. అలాంటి ఘటనే మరోసారి జరిగింది. అజిత్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు. అజిత్ కు హైదరాబాద్ తో విడదీయరాని అనుబంధం ఉంది. ఎందుకంటే ఈయన ఇక్కడే పుట్టి పెరిగాడు కాబట్టి. హీరో కాకముందు హైదరాబాద్ లోనే బైక్ మెకానిక్ గా ఉన్నాడు అజిత్. అందుకే ఇక్కడికి ఎప్పుడు వచ్చినా కూడా సొంతూరుకు వచ్చినట్లు ఫీల్ అవుతుంటాడు. 

ప్రస్తుతం ఈయన నటిస్తున్న ‘వాలిమై’ సినిమా షూటింగ్ చివరి షెడ్యూల్ హైదరాబాద్ లోనే జరిగింది మొన్నటి వరకు. ఈ షూటింగ్ జరిగినన్ని రోజులు అజిత్ తన సిబ్బందిని పక్కనపెట్టి సొంత బైక్ మీదే సిటీలో తిరిగాడు. అంతేకాదు రాత్రి పూట తనకు దగ్గర్లో ఉన్న ఇడ్లీ బండి వద్దకు వెళ్లేవాడు. అలా వెళ్లినపుడు ఆయన పిల్లల గురించి అడిగిన అజిత్.. వాళ్ల కష్టాలు తెలుసుకుని వెంటనే చదువుల కోసం లక్ష రూపాయల సాయం చేసాడు. అయితే ఈయనేం చేసినా కూడా బయటికి రాకుండా జాగ్రత్త పడుతుంటాడు. అప్పట్లో తన దగ్గర పని చేస్తున్న స్టాఫ్ కోసం ఇల్లు కూడా కట్టించాడు అజిత్. మొత్తానికి ఈయన మనసు చూసి అంతా ఫిదా అవుతున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

శృతిహాస‌న్‌, అమ‌లాపాల్‌..బోల్డ్‌గా 'పిట్ట‌క‌థ‌లు' టీజ‌ర్‌

కిస్ ఇవ్వ‌లేద‌ని.. ఆమె న‌న్ను వదిలేసి వెళ్లింది

రాశీఖ‌న్నాకు నో చెప్పిన గోపీచంద్‌..!

టాలీవుడ్‌ మోస్ట్ వాంటెడ్ విల‌న్ ఇత‌డే..!

చిరంజీవి న‌న్ను చాలా మెచ్చుకున్నారు..

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo