మంగళవారం 02 మార్చి 2021
Cinema - Oct 23, 2020 , 15:26:27

దుర్గామాత ఉత్స‌వాలు.. సోనూనూద్ విగ్ర‌హం ఏర్పాటు

దుర్గామాత ఉత్స‌వాలు.. సోనూనూద్ విగ్ర‌హం ఏర్పాటు

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌జ‌ల జీవితాలని చిన్నాభిన్నం చేసింది. ఒక‌ప్పుడు హుందాగా బ‌తికిన వారు కూడా క‌రోనా క‌ష్ట‌స‌మ‌యంలో క‌డుపు నింపుకునేందుకు రోడ్డెక్కాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. ఇలాంటి స‌మ‌యంలో బాలీవుడ్ న‌టుడు సోనూసూద్ అడిగిన వారికి లేద‌న‌కుండా సాయం చేశాడు. వ‌ల‌స కార్మికుల‌ని సొంతిళ్ళ‌కు పంపి వారి క‌ళ్ళ‌ల్లో ఆనందం చూశాడు. ఉద్యోగాలు పోయిన వారికి తిరిగి ఉద్యోగాలు వ‌చ్చేలా చేశాడు. విదేశాల‌లో ఉన్న వారిని కూడా వారి ఇళ్ళ‌కు చేర్చ‌డం కోసం అనేక ఏర్పాట్లు చేశారు 

లాక్‌డౌన్ స‌మ‌యంలో ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన సోనూసూద్ ప్ర‌జ‌ల గుండెల్లో రియ‌ల్ హీరోగా కొల‌వ‌బ‌డుతున్నారు. ఈ క్ర‌మంలో బెంగాల్‌లోని కోల్‌క‌తాలో ఏర్పాటు చేసిన దుర్గా మండ‌పాల వ‌ద్ద నిర్వాహ‌కులు సోనూసూద్ ప్ర‌తిమ‌ను ఉంచి ఆయ‌న‌పై త‌మ‌కున్న ప్రేమ‌ను చాటుకున్నారు. దుర్గామాత మిమ్మ‌ల్ని చ‌ల్లగా చూడాలి. ఎల్ల‌ప్పుడు సుఖంగా, సంతోషంగా ఉండాలి అని ప్రార్ధిస్తున్నారు. ప్ర‌స్తుతం సోనూసూద్ విగ్ర‌హంకి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. 

VIDEOS

logo