మోస్ట్ క్రేజీ కపుల్ అనుష్క- విరాట్ కోహ్లీ ఎప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట కొద్ది రోజుల క్రితం వామిక అనే చిన్నారికి జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆ చిన్నారితో ఆనందక్షణాలు గడుపుతున్నారు. అయితే వీరి లైఫ్‌లో ఓ మధురమైన క్షణాన్ని తాజాగా గుర్తు చేసుకున్నాడు కోహ్లీ.
ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉన్న విరాట్.. టెస్ట్ సిరీస్ కోసం ఫ్యామిలీతో అక్కడికి వెళ్లాడు.అయితే తొలి టెస్ట్‌కి ముందు.. క్రికెటర్ దినేష్ కార్తిక్ తో మాట్లాడే క్రమంలో.. అనుష్క శర్మతో తన ఫస్ట్ మీటింగ్ గురించి చెప్పాడు. రివర్స్ అటాకింగ్లోనే తమ మీటింగ్ మొదలైందని అన్నాడు. ఓ సారి అనుష్క కలిసినప్పుడు, ఆమె హై హీల్స్ చూసి జోక్ చేశాను. ఇంతకంటే.. ఎత్తు చెప్పులు దొరకలేదా? అని జోక్ చేశాను.
తాను సీరియస్ అయింది. నా పై పంచ్ వేసింది. ఆరడుగులు లేను కదా అందుకే హై హీల్స్ వేసుకున్నాను అని చెప్పింది. ఇదే తమ ఫస్ట్ మీటింగ్ అని కోహ్లీ చెప్పాడు. తన కూతురి గురించి కూడా మాట్లాడుతూ, తనని చూడకుండా ఉండలేనని భావోద్వేగానికి గురయ్యాడు. కాగా.. 2013లో ఓ షాంపూ ప్రకటనలో కోహ్లీ-అనుష్క శర్మ కలిసి నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు.