శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Sep 23, 2020 , 03:33:23

ఫీల్డర్‌పై రాహుల్‌ తిట్ల దండకం..

ఫీల్డర్‌పై రాహుల్‌ తిట్ల దండకం..

దుబాయ్‌:  కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి మ్యాచ్‌లోనే కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ స్టార్‌ కేఎల్‌ రాహుల్‌ నియంత్రణ కోల్పోయాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఓ ఫీల్డర్‌ను రాహుల్‌.. కన్నడ భాషలో అసభ్య పదజాలంతో దూషించాడు. వికెట్‌ కీపింగ్‌ చేస్తూ తిట్టిన అతడి మాటలు స్టంప్‌ మైక్‌కు చిక్కాయి. రాహుల్‌ కర్ణాటకకు చెందిన ఆటగాడు కాగా పంజాబ్‌ జట్టులో మయాంక్‌ అగర్వాల్‌, కరుణ్‌ నాయర్‌, కృష్ణప్ప గౌతమ్‌ కూడా ఆ రాష్ర్టానికి చెందిన వారే. రాహుల్‌ తిట్లపై సోషల్‌ మీడియాలో పలువురు అభిమానులు ట్రోలింగ్‌ చేస్తున్నారు.