బుధవారం 28 అక్టోబర్ 2020
Cinema - Sep 21, 2020 , 18:07:38

డ్ర‌గ్స్‌ కేసులో అరెస్ట్ అయిన ఎబిసిడి ఫేమ్ 'కిషోర్ శెట్టి'

డ్ర‌గ్స్‌ కేసులో అరెస్ట్ అయిన ఎబిసిడి ఫేమ్ 'కిషోర్ శెట్టి'

మాద‌క‌ద్ర‌వ్యాల‌ను స్వాధీనం చేసుకున్నందుకు న‌టుడు-డ్యాన్స‌ర్ కిషోర్ శెట్టిని మంగ‌ళూరు పోలీసులు శ‌నివారం నాడు అరెస్ట్ చేశారు. మిథిలీన్ డ‌యాక్సిమెథాంఫేట‌మిన్(ఎండిఎంఎ) క‌లిగి ఉండడం వ‌ల్ల కిషోర్‌తో పాటు అకిల్ నౌషీల్ అనే యువ‌కుడిని కూడా అరెస్ట్ చేశారు. కిషోర్ ప్ర‌ముఖ డ్యాన్స్ రియాలిటీ షో 'డ్యాన్స్ ఇండియా డ్యాన్స్‌'లో పాల్గొన్నారు. అంతేకాదు బాలీవుడ్ చిత్రం 'ఎబిసిడి' ఎనీబ‌డీ కెన్ డ్యాన్స్ అనే చిత్రంలో కూడా న‌టించాడు.

కిషోర్‌, అకల్ ఇద్ద‌రు క‌లిసి మ‌హారాష్ట్ర‌లోని ముంబై నుంచి డ్ర‌గ్స్ సేక‌రించి క‌ర్ణాట‌క‌లోని మంగ‌ళూరులో విక్ర‌యిండానికి ప‌నిచేస్తున్నార‌ని మంగ‌ళూరు పోలీస్ క‌మిష‌న‌ర్ తెలిపారు. వీరి వ‌ద్ద ఎండిఎంఎ, బ‌జాజ్ డిస్క‌వ‌ర్ బైక్‌, రెండు ఫోన్‌ల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అకీల్ ఇంత‌కుముందు విదేశాల‌లో సేఫ్టీ ఆఫీస‌ర్‌గా ప‌నిచేశాడు. ఏడాది క్రితం ఇండియాకు తిరిగి వ‌చ్చాడు. త‌ర్వాత ఈ బిజినెస్ మొద‌లుపెట్టాడు. అకీల్‌తో పాటు కిషోర్ కూడా చేతులు క‌లిపాడు. పోలీసులు వీరిద్ద‌రిని అదుపులోకి తీసుకొని డ్ర‌గ్ క‌నెక్ష‌న్స్‌పై ద‌ర్యాప్తు చేస్తారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డిపిఎస్) చట్టం కింద కేసు నమోదైంది.


logo