శుక్రవారం 04 డిసెంబర్ 2020
Cinema - Oct 29, 2020 , 02:35:57

‘వేదాళం’ రీమేక్‌లో కీర్తిసురేష్‌

‘వేదాళం’ రీమేక్‌లో కీర్తిసురేష్‌

తెలుగు, తమిళ భాషల్లో అరడజనుకుపైగా చిత్రాల్లో నటిస్తూ బిజీగా  ఉంది కీర్తిసురేష్‌. కమర్షియల్‌ చిత్రాలతో పాటు నటనకు ఆస్కారమున్న విభిన్నమైన పాత్రలపై దృష్టిసారిస్తోంది. తాజాగా తెలుగులో కీర్తిసురేష్‌ మరో మంచి అవకాశాన్ని సొంతం చేసుకున్నట్లు సమాచారం. అగ్రకథానాయకుడు చిరంజీవి సోదరి పాత్రలో ఆమె కనిపించబోతున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే. చిరంజీవి కథానాయకుడిగా మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్నది. అజీత్‌ నటించిన తమిళ చిత్రం ‘వేదాళం’ ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలి పాత్రలో  కీర్తిసురేష్‌ నటించనున్నట్లు సమాచారం. తొలుత ఈ పాత్ర కోసం సాయిపల్లవిని ఎంపికచేసినట్లు ప్రచారం జరిగింది. అనివార్య కారణాల వల్ల ఆమె స్థానంలో కీర్తిసురేష్‌ను తీసుకున్నట్లు  చెబుతున్నారు. చిరంజీవి స్వయంగా కీర్తిసురేష్‌ పేరును చిత్రబృందానికి సూచించినట్లు వార్తలొస్తున్నాయి. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రాబోతున్నట్లు తెలిసింది. 

తాజావార్తలు