బుధవారం 03 జూన్ 2020
Cinema - Mar 28, 2020 , 16:35:33

సినీ కార్మికులకి కోటి రూపాయ‌ల విరాళాన్ని ప్ర‌క‌టించిన నాగ్‌

సినీ కార్మికులకి కోటి రూపాయ‌ల విరాళాన్ని ప్ర‌క‌టించిన నాగ్‌

కరోనా మ‌హ‌మ్మారిని క‌ట్టిడి చేసేందుకు కేంద్రం ప్ర‌క‌టించిన లాక్ డౌన్ కార‌ణంగా వ్యాపార‌, క్రీడా, సినిమాతో పాటు ప‌లు రంగాలు మూత ప‌డ్డాయి. ముఖ్యంగా సినిమా షూటింగ్‌లు బంద్ కావ‌డంతో సినీ కార్మికుల‌కి తిన‌డానికి కావ‌ల్సిన తిండి క‌రువైంది. ఈ స‌మ‌యంలో పేద కార్మికులకి తామున్నామ‌నే భ‌రోసా ఇస్తున్నారు టాలీవుడ్ ప్ర‌ముఖులు.  ఇప్పటికే మెగాస్టార్‌ చిరంజీవి పేద సినీ కార్మికుల కోసం రూ. కోటి విరాళం ఇ‍వ్వగా.. తాజాగా టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున సైతం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో(టీఎఫ్‌ఐ)ని రోజువారి కూలీలకు, అలాగే తక్కువ సంపాదన ఉన్న వాళ్లకు తన వంతు సాయంగా రూ. కోటి విరాళం ప్రకటించారు.

కోటి రూపాయ‌ల‌ని  టీఎఫ్‌ఐకి అందించిన నాగార్జున‌ ‘ప్రస్తుతం లాక్‌డౌన్‌ అనేది అవసరం. కరోనా వ్యాప్తిని నిరోధించాలంటే లాక్‌డౌన్‌ అవసరం. లాక్‌డౌన్‌ పాటిస్తున్న వారికి.. మద్దతుగా నిలుస్తున్న వారికి నా అభినందనలు. ఈ కష్టకాలంలో ప్రభుత్వానికి అండగా నిలుస్తున్న వారికి కూడా ధన్యవాదాలు. ఈ సమయంలో పేద సినీ కార్మికుల కోసం నా వంతుగా రూ. కోటి రూపాయలు విరాళంగా ప్రకటిస్తున్నా. దేవుడు మనలను చల్లగా చూస్తాడు.. ఇంట్లోనే ఉండండి సురక్షితంగా ఉండండి’అంటూ నాగార్జున త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.


logo