సోమవారం 30 నవంబర్ 2020
Cinema - Oct 22, 2020 , 11:26:58

ఫారెస్ట్‌లో ట్రెకింగ్ చేసిన కియారా.. ఫోటోలు వైర‌ల్

ఫారెస్ట్‌లో ట్రెకింగ్ చేసిన కియారా.. ఫోటోలు వైర‌ల్

భ‌ర‌త్ అనే నేను సినిమాతో తెలుగు ప్రేక్ష‌కులకు ద‌గ్గ‌రైన క్యూట్ భామ కియారా అద్వాని. ఆమె న‌టించిన తాజా చిత్రం ల‌క్ష్మీ బాంబ్. ఈ సినిమా మ‌రి కొద్ది రోజుల‌లో ఓటీటీలో విడుద‌ల కానుండ‌గా, కొద్ది రోజులుగా ప్ర‌మోషన్ కార్య‌క్ర‌మాల‌లో చురుకుగా పాల్గొంది. అయితే వీటికి చిన్న బ్రేక్ ఇచ్చిన అమ్మ‌డు త‌న ఫ్రెండ్స్‌తో క‌లిసి ట్రెకింగ్ చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలు త‌న సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేసింది.

మెడిటేష‌న్ చేస్తుండ‌గా, క్లిక్‌మ‌నిపించిన ఫోటోని త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన కియారా.. పైన‌ ఆకాశం.. కింద భూమి.. మనస్సులో ప్రశాంతత అంటూ  కామెంట్ పెట్టింది. మ‌హారాష్ట్ర‌లో ట్రెకింగ్ డైరీస్ అంటూ ప్ర‌కృతి ఒడిలో సేదతీరుతున్న ఫోటోలు, వీడియోలు షేర్ చేసి  ఫ్యాన్స్‌కు థ్రిల్ క‌లిగిస్తుంది.