గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Sep 06, 2020 , 00:29:45

కియారా స్పోర్ట్స్‌ డ్రామా

కియారా స్పోర్ట్స్‌  డ్రామా

ఒక్క విజయంతో చిత్రసీమలో తారల జాతకాలు మొత్తం మారిపోతాయి. ఢిల్లీ సోయగం కియారా అద్వాణీ విషయంలో అదే జరిగింది. కెరీర్‌ ఆరంభంలో కష్టాల్ని ఎదుర్కొన్న ఆమెకు  ‘కబీర్‌సింగ్‌' రూపంలో భారీ విజయం వరించింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో గుడ్‌న్యూస్‌, లక్ష్మీబాంబ్‌, ఇందూకి జవానీ వంటి పెద్ద సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. మరోవైపు దక్షిణాదిన కూడా కియారాకు పెద్ద సినిమాల ఆఫర్లు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ ఢిల్లీ సొగసరి తెలుగులో మరో సినిమాకు అంగీకరించినట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే...వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా సాయి కొర్రపాటి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. క్రీడానేపథ్యంలో రూపొందించనున్న ఈ సినిమాలో వరుణ్‌తేజ్‌ బాక్సర్‌ పాత్రలో కనిపించబోతున్నారు. 

ఈ చిత్రంలో కథానాయికగా కియారా అద్వాణీ ఎంపికైనట్లు తెలిసింది. వాణిజ్య హంగులతో పాటు అభినయనానికి ఆస్కారమున్న పాత్ర  కావడంతో ఆమె ఈ సినిమాకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిందని అంటున్నారు.  ‘భరత్‌ అనే నేను’ ‘వినయ విధేయ రామా’ చిత్రాలతో తెలుగులో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది కియారా అద్వాణీ. రెండేళ్ల విరామం తర్వాత ఆమె తెలుగు సినిమా చేయబోతుండటం విశేషం.


logo