మంగళవారం 01 డిసెంబర్ 2020
Cinema - Aug 07, 2020 , 01:12:53

అదే నా బలహీనత

అదే నా బలహీనత

అభద్రతాభావం, పోటీతత్వం అత్యుత్తమ ప్రతిభను కనబరచడానికి దోహదపడతాయని ఆంటోంది బాలీవుడ్‌ సొగసరి కియారా అద్వాణీ. తన అభీష్టాలు, సినీ ప్రయాణాన్ని గురించి కియారా అద్వాణీ మాట్లాడుతూ “లస్ట్‌ స్టోరీస్‌' నా కెరీర్‌కు టర్నింగ్‌పాయింట్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాతే నటిగా ఎలాంటి పాత్రకైనా న్యాయం చేయగలననే నమ్మకం దర్శకుల్లో కలిగింది.  కెరీర్‌ తొలినాళ్లలో అదృష్టాన్ని ఎక్కువగా నమ్మేదాన్ని. కానీ కష్టపడేతత్వమే ప్రతిభకు తార్కాణమని సల్మాన్‌ఖాన్‌ ఇచ్చిన సలహాతో నటనను మెరుగుపరుచుకోవడంపై దృష్టిపెట్టాను.  

అయితే తరచుగా చివరి నిమిషయంలో నిర్ణయాల్ని మార్చుకుంటాను. అదే నా బలహీనత అని నా స్నేహితులంతా కైంప్లెంట్‌ చేస్తుంటారు. ఆ ఒక్క విషయంలో నన్ను నేను మార్చుకోవాలని చాలా రోజులుగా అనుకుంటున్నా.  సినిమాల ఒత్తిడి నుంచి దూరం అవ్వడానికి పెయింటింగ్స్‌ వేస్తుంటాను. ట్రావెలింగ్‌కు ప్రాధాన్యతనిస్తాను. సముద్రతీరాలు మనసుకు స్వాంతన చేకూర్చుతాయి.  

ఏ మాత్రం విరామం దొరికినా మాల్దీవులకు వెళ్లి స్కూబా డైవింగ్‌ చేస్తుంటాను.  ప్రస్తుతం లాక్‌డౌన్‌ వల్ల కుదరడం లేదు.  అహంకార మనస్తత్వమున్న వ్యకులకు దూరం ఉండటానికి ప్రయత్నిస్తా. ఎదుటివారి వ్యక్తిత్వాన్ని గౌరవిస్తూ, తప్పొప్పుల్ని సమంగా స్వీకరించే గుణం  ఉన్న వ్యక్తి  జీవితభాగస్వామిగా రావాలని కోరుకుంటున్నా.  నా జీవితంలోకి వచ్చే వ్యక్తి నిజాయితీ కలిగి ఉంటూ ఎప్పుడూ సరదాగా నవ్విస్తూ ఉండాలి. అలాంటి లక్షణాలున్న వ్యక్తి కోసమే ఎదురుచూస్తున్నా’ అని చెప్పింది.