గురువారం 03 డిసెంబర్ 2020
Cinema - Jul 01, 2020 , 16:42:23

నేను ఈ ఉద్యోగానికి స‌రిపోతానా అనుకున్నా: కైరా అద్వానీ

నేను ఈ ఉద్యోగానికి స‌రిపోతానా అనుకున్నా: కైరా అద్వానీ

ఫ‌గ్లీ సినిమాతో ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైంది అందాల తార కైరా అద్వానీ. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ప‌రిశ్ర‌మ‌లోకి వ‌చ్చి త‌న‌కంటూ ప్ర‌త్యేకంగా ఫాలోవ‌ర్లను సంపాదించుకుంది. ఈ బ్యూటీ కెరీర్ తొలినాళ్ల గురించి కొన్ని విష‌యాలు షేర్ చేసుకుంది. ఫ‌గ్లీ సినిమాకు ముందు చాలా ఆడిష‌న్స్‌కు వెళ్లా. అయితే వాళ్లు నాకు కాల్ చేయ‌టానికి నెల‌ల‌పాటు స‌మ‌యం తీసుకుంటార‌నుకున్నా. కానీ త‌క్కువ‌స‌మ‌యంలో ఫగ్లీ సినిమా నిర్మాత ఆశిని యార్ది నుంచి అక్ష‌య్ కుమార్ ఆఫీస్ కు రావాల‌ని ఓ ఫోన్ కాల్ వ‌చ్చింది.

ఫ‌గ్లీ చిత్ర నిర్మాత‌ల్లో అక్ష‌య్ కుమార్ ఒక‌రు. మా అమ్మానాన్న‌ల‌తో క‌లిసి వారి ఆఫీసుకు వెళ్లాను. అక్ష‌య్  కుమార్, ఆశిని యార్ది ఆఫీసులో ఉన్నారు. నేను ఫగ్లీ సినిమాలో ఎంపిక అయ్యాన‌ని వారు నాతో చెప్పారు. అప్ప‌డున్న ప‌రిస్థితిలో ఏం జ‌రుగుతుందో నాకు అర్థం కాలేదు. నాకు అపుడు ఇదే నా గమ్య‌మ‌ని అనిపించింది. సినిమా షూటింగ్ తొలి రోజు హెయిర్ స్టైల్ సెట్ చేయ‌డం, మేక‌ప్ వేయ‌డంతో కొంత భ‌యంగా, ఎక్జ‌యిటింగ్ గా అనిపించింది. నేను ఈ ఉద్యోగానికి స‌రిపోతానా..? అని అనిపించింద‌ని త‌న అనుభ‌వాల‌ను పంచుకుంది. 

ల‌స్ట్ స్టోరీస్, ఎంఎస్ ధోనీ, క‌బీర్ సింగ్, గుడ్ న్యూస్, మ‌హ‌ర్షి చిత్రాల‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది కైరా. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.