మంగళవారం 01 డిసెంబర్ 2020
Cinema - Jul 19, 2020 , 14:44:08

కైరాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం..ఫొటోలు

కైరాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం..ఫొటోలు

తన అందం అభియనంతో దక్షిణాదితోపాటు దేశవ్యాప్తంగా ఎంతోమంది ఫాలోవర్లను సంపాదించుకుంది అందాల తార కైరా అద్వానీ. లాక్‌ డౌన్‌ షురూ అయినప్పటి నుంచి ఇన్‌ స్టాగ్రామ్‌ లో కొత్త కొత్త విషయాలను షేర్‌ చేసుకుంటున్న ఈ బ్యూటీ..సరికొత్త స్టి్ల్స్‌ షేర్ చేసుకుంటుంది. సాధారణంగా హీరోయిన్లలో ఒక్కొక్కరికి ఒక్కో కలర్‌ అంటే ఇష్టముంటుంది. మరి కైరాకు ఏ రంగంటే ఇష్టమో తెలుసా..? కైరా ఫాలో అయే వారైతే ఈ ప్రశ్నకు సమాధానమిస్తారు.

అయితే సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న కైరా ఫొటోలుల చూస్తుంటే కూడా దీనికి జవాబు దొరుకుతుంది. కైరా అద్వానీ వేసుకున్న ట్రెండీ కాస్ట్యూమ్స్‌ను గమనిస్తే..ప్రతీ డ్రెస్‌ లోనూ పింక్‌ కలర్ ఉండేలా చూసుకుంటుంది. దీన్ని బట్టి కైరాకు పింక్‌ కలర్‌ అంటే ఇష్టమని నెటిజన్లు అంచనాకు వస్తున్నారు. కైరా స్టిల్స్‌ పై ఓ లుక్కేయండి మరీ..!