బుధవారం 03 జూన్ 2020
Cinema - Apr 25, 2020 , 08:24:07

ప్ర‌భాస్ స‌ర‌స‌న ఆ బ్యూటీ ఫైన‌ల్‌..!

ప్ర‌భాస్ స‌ర‌స‌న ఆ బ్యూటీ ఫైన‌ల్‌..!

సాహో చిత్రం త‌ర్వాత ప్ర‌భాస్ జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ డియ‌ర్ అనే చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియ‌ని ప‌రిస్థితి. ఇక మ‌హాన‌టి వంటి సూప‌ర్ హిట్ చిత్రాన్ని తెర‌కెక్కించిన నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలోను ప్ర‌భాస్ ఓ సినిమా చేయ‌నుండ‌గా, ఈ చిత్రంలో క‌థానాయిక ఎవ‌ర‌నే దానిపై కొద్దిరోజులుగా ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

నాగ్ అశ్విన్‌- ప్ర‌భాస్ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో నిర్మించబడుతుండ‌గా, ఈ సినిమా అన్ని ప్రధాన భాషల్లో విడుదల కానుంది. కీల‌క పాత్ర‌ల కోసం ప‌లువురు బాలీవుడ్ స్టార్స్ ని ఎంపిక చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఇక హీరోయిన్ కోసం  బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె ఈ సినిమాలో నటించడం దాదాపు ఖరారైందని.. లాక్ డౌన్ తరువాత ఫైనల్‌గా ఓ ప్రకటన చేయనున్నారని స‌మాచారం. సైన్స్ ఫిక్ష‌న్ నేప‌థ్యంలో రూపొంద‌నున్న ఈ సినిమా కోసం 50 కోట్ల‌కి పైగా బ‌డ్జెట్ కేటాయించ‌నున్న‌ట్టు తెలుస్తుంది .


logo