కొవిడ్ ఉదృతితో తెలుగు చిత్రసీమలో అగ్రహీరోల సినిమాల విడుదలలు వాయిదాపడుతున్నాయి. ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన చిరంజీవి ‘ఆచార్య’, వెంకటేష్ ‘నారప్ప’ సినిమాల్ని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా విడుదలచేయడం లేదంటూ చిత్రబృందాలు ప్రకటించాయి. తాజాగా ఈ జాబితాలో రవితేజ ‘ఖిలాడి’ సినిమా చేరింది. రవితేజ హీరోగా రమేష్‌వర్మ పెన్మత్స దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఈ నెల 28న విడుదలకావాల్సివుంది. సెకండ్ వేవ్ మూలంగా రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం బుధవారం ప్రకటించింది. త్వరలో కొత్త విడుదల తేదీని వెల్లడిస్తామని తెలిపింది. జయంతీలాల్ గద సమర్పణలో కోనేరు సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారు.