శనివారం 06 మార్చి 2021
Cinema - Jan 26, 2021 , 11:03:53

ర‌వితేజ బ‌ర్త్‌డే .. ఖిలాడి ఫ‌స్ట్ గ్లింప్స్ విడుద‌ల‌

ర‌వితేజ బ‌ర్త్‌డే  .. ఖిలాడి ఫ‌స్ట్ గ్లింప్స్ విడుద‌ల‌

మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ రీసెంట్‌గా క్రాక్ చిత్రంతో క్రాకింగ్ హిట్ కొట్టిన సంగ‌తి తెలిసిందే. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి వ‌సూళ్ళ‌తో దూసుకుపోతున్న ఈ చిత్రం మ‌రి కొద్ది రోజుల‌లో ఓటీటీలో విడుద‌ల కానుంది. మ‌రోవైపు ఖిలాడి అనే చిత్రం చేస్తున్న ర‌వితేజ త‌న 53వ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా చిత్రం నుండి ఫ‌స్ట్ గ్లింప్స్ విడుద‌ల చేశారు. ఇది అభిమానుల‌ని ఆక‌ట్టుకుంటుంది.

ఖిలాడి చిత్రం ర‌వితేజ 67వ చిత్రం కాగా,  డా.జయంతిలాల్‌ గడ సమర్పణలో ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో  మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్స్‌గా నటిస్తుండగా.. రవితేజ డ్యూయెల్‌ రోల్‌ పోషిస్తున్నారు. రాక్‌స్టార్‌ దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. స‌మ్మ‌ర్‌లో ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తెచ్చే ప్లాన్ చేస్తున్నారు.


VIDEOS

logo