మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Oct 07, 2020 , 15:30:39

త్వ‌ర‌లో త్రివిక్ర‌మ్ తో సినిమా..! ట్విట‌ర్ లో మ‌హేశ్ బాబు

త్వ‌ర‌లో త్రివిక్ర‌మ్ తో సినిమా..! ట్విట‌ర్ లో మ‌హేశ్ బాబు

టాలీవుడ్ సెల‌బ్రిటీలు మ‌హేశ్ బాబు-త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. వీరిద్ద‌రి క‌ల‌యికలో వ‌చ్చిన అత‌డు సినిమా ఇండ‌స్ట్రీలో రికార్డులు సృష్టించింది. ఆ త‌ర్వాత వ‌చ్చిన ఖ‌లేజా చిత్రం  ఆశించిన విజయాన్ని అందుకోలేక‌పోయింది. అయితే త్రివిక్ర‌మ్ మార్కు డైలాగ్స్, మ‌హేశ్ యాక్టింగ్ ప్రేక్ష‌కుల‌ను అల‌రించాయి. ఈ సినిమా విడుద‌లై నేటికి ప‌దేళ్లు పూర్తయింది. ఈ విష‌యాన్ని మ‌హేశ్ ట్విట‌ర్ ద్వారా షేర్ చేస్తూ..న‌న్ను న‌టుడిగా మ‌రోసారి ఆవిష్క‌రించిన చిత్ర‌మిది. ఎప్పుడూ ఈ సినిమా నాకు ప్ర‌త్యేకం. నా ప్రియ‌మైనే స్నేహితుడు త్రివిక్ర‌మ్ కు ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నా. మా ఇద్ద‌రి కాంబోలో త్వ‌ర‌లోనే వ‌చ్చే చిత్రం కోసం ఎదురుచూస్తున్నానంటూ ట్వీట్  చేశాడు.

మ‌హేశ్ బాబు ట్వీట్ తో అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. కొన్నాళ్ల క్రిత‌మే మ‌హేశ్‌-త్రివిక్ర‌మ్ హ్యాట్రిక్ కాంబినేష‌న్ తెర‌పైకి వ‌స్తుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే దీనిపై మ‌హేశ్ క్లారిటీ ఇవ్వ‌డంతో వీరిద్ద‌రి ప్రాజెక్టు ఎలాంటి కథాంశంతో రానుంద‌నేది  తెలియాలంటే మ‌రికొంత‌కాలం ఆగాల్సిందే.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo