గురువారం 13 ఆగస్టు 2020
Cinema - Aug 01, 2020 , 16:03:07

టోరంటో చిత్రోత్సవంలో ఖైదీ..!

టోరంటో చిత్రోత్సవంలో ఖైదీ..!

కార్తి కథానాయకుడుగా దర్శకుడు లోకేష్‌ కనకరాజన్‌ తెరకెక్కించిన  చిత్రం ఖైదీ. ఈ మూవీ సరికొత్త పంథాకు స్ఫూర్తిగా నిలిచింది. నాయిక, పాటలు లేకుండా కేవలం కథతోనే ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. అందుకే ఈ థ్రిల్‌ను హిందీ ప్రేక్షకులకు అందించేందుకు సన్నాహాలు కూడా ప్రారంభమయ్యాయి. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న ఈ చిత్రం టోరంటో చిత్రోత్స‌వంలో ప్ర‌ద‌ర్శితం కానుంది.

భారత అంతర్జాతీయ టొరంటో చలన చిత్రోత్సవం   ఆగస్టు 9 నుంచి, 15 వరకు జ‌ర‌గ‌నుంది. స్వాతంత్య్ర దినోత్సవ శుభ సమయంలో కెనడాలో జ‌ర‌గ‌నున్న ఈ వేడుక‌లో ఖైదీ చిత్రం ప్ర‌ద‌ర్శించ‌నుండ‌డం గొప్ప విష‌యం అని అంటున్నారు.  జెర్సీ చిత్రం కూడా టొరంటో చిత్రోత్స‌వంలో ప్ర‌ద‌ర్శించ‌బ‌డుతుంద‌నే సంగ‌తి తెలిసిందే.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo