కార్తీతో ఖైదీ సినిమా తీసి ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాడు లోకేశ్ కనగరాజ్. ఈ దర్శకుడు ప్రస్తుతం కమల్‌హాసన్‌తో విక్రమ్ సినిమాను లైన్లో పెట్టాడు. ప్రేక్షకులకు బోరు కొట్టకుండా సినిమాను తీయడంలో లోకేశ్ స్టైలే వేరు. ఈ క్రేజీ డైరెక్టర్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో లోకేశ్ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడన్న వార్త సౌతిండియాలో చక్కర్లు కొడుతోంది. లోకేశ్ చెప్పిన ఇంప్రెసిస్ స్టోరీ లైన్ ప్రభాస్ కు నచ్చిందట. ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నట్టు లోకేశ్ చెప్పాడు.
తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో తెరకెక్కనుంది. 2022లో ఈ ప్రాజెక్టు సెట్స్‌పైకి వెళ్లనుందట. ప్రభాస్ నటిస్తోన్న రాధేశ్యామ్ జులై 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరోవైపు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్, ఓం రావత్ దర్శకత్వంలో ఆదిపురుష్, నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు. వీటితోపాటు తాజాగా లోకేశ్ కనగరాజ్ ప్రాజెక్టు కూడా చేరిపోయింది.
ఇవి కూడా చదవండి
పూజాహెగ్డే డిఫరెంట్ గ్లామర్ షేడ్స్..వీడియో వైరల్
విజయ్ సైకిల్ పై వెళ్లడానికి కారణమిదే..!
రష్మికకు మాజీ బాయ్‌ఫ్రెండ్ విషెస్..వీడియో
సైకిల్ పై వెళ్లి ఓటేసిన స్టార్ హీరో విజయ్..వీడియో వైరల్
మరో పీరియాడిక్ డ్రామాలో రానా..?
పవన్ చేతికి స్నేక్ రింగ్..స్పెషల్ ఏంటో..?
‘ఎఫ్ 2’ హిందీ రీమేక్‌లో హీరో ఇతడే..!
శివమణి నా అభిమాని అని తెలియదు: పవన్‌కల్యాణ్
దీపికా, అమితాబ్ కాంబోలో మరో సినిమా
ఆలోచింపజేస్తున్న ‘రిపబ్లిక్’ టీజర్