గురువారం 04 జూన్ 2020
Cinema - May 10, 2020 , 08:50:34

లోక‌ల్ ఛానెల్‌లో కేజీఎఫ్‌.. మండిప‌డ్డ నిర్మాత‌

లోక‌ల్ ఛానెల్‌లో కేజీఎఫ్‌.. మండిప‌డ్డ నిర్మాత‌

ఇటీవ‌లి కాలంలో దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన క‌న్న‌డ చిత్రం కేజీఎఫ్‌. య‌శ్ హీరోగా తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కించారు. అక్ర‌మ మైనింగ్ నేప‌థ్యంలో రూపొందిన ఈ చిత్రానికి దేశ వ్యాప్తంగా మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. ప్ర‌స్తుతం కేజీఎఫ్ చిత్రానికి సంబంధించి సీక్వెల్ తెర‌కెక్కిస్తుండ‌గా, ఇందులో  తెలుగు నటుడు రావు రమేష్ కీ, బాలీవుడ్ న‌టి రవీనా టాండన్, సంజయ్ దత్ లాంటి భారీ స్టార్ క్యాస్ట్ ఉన్నారు.

అయితే కేజీఎఫ్ చిత్రం శాటిలైట్ రైట్స్‌కి సంబంధించిన ప్ర‌స్తుతం చ‌ర్చ‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలో తెలుగు లోక‌ల్ ఛానెల్ ఈ చిత్రాన్ని ప్ర‌సారం చేయ‌డాన్ని త‌ప్పు ప‌ట్టారు కేజియఫ్ నిర్మాత కార్తీక్ గౌడ. ఎవ్రీ అనే తెలుగు లోక‌ల్ ఛానెల్ కేజీఎఫ్ చిత్రాన్ని అక్ర‌మంగా ప్ర‌సారం చేసింది . వారిపై చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటాము. ఓ వైపు శాటిలైట్ డీల్స్ దాదాపు ఫైన‌ల్ అవుతున్న స‌మ‌యంలో కేబుల్ ఛానెల్ చిత్రాన్ని ప్ర‌సారం చేసింది. తమ దగ్గర ఆ ఛానెల్‌లో ప్రసారమైనట్టు స్క్రీన్ షాట్స్, వీడియోలు ఉన్నాయని తెలిపాడు కార్తిక్ గౌడ. ఇలాంటి నీచమైన సంస్క‌ృతి లోకల్ చానెల్స్‌లో ఉందని.. శాటిలైట్ రైట్స్‌పై, డిజటల్ హక్కులపై వారికి కనీస గౌరవం కూడా లేద‌ని స్ప‌ష్టం చేశాడు. 


logo