బుధవారం 21 అక్టోబర్ 2020
Cinema - Aug 04, 2020 , 12:27:24

కేజీఎఫ్ స్టార్ ఇంట్లో ర‌క్షాబంధ‌న్ వేడుక‌..ఫోటోలు వైర‌ల్

కేజీఎఫ్ స్టార్ ఇంట్లో ర‌క్షాబంధ‌న్ వేడుక‌..ఫోటోలు వైర‌ల్

కేజీఎఫ్ చిత్రంతో దేశ వ్యాప్తంగా ఆద‌ర‌ణ ద‌క్కించుకున్న క‌న్న‌డ న‌టుడు య‌ష్‌. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే య‌ష్ అప్పుడ‌ప్పుడు త‌న పిల్ల‌ల ఫోటోల‌ని షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కి థ్రిల్ అందిస్తుంటాడు. సోమ‌వారం ర‌క్షా బంధ‌న్ సంద‌ర్భంగా త‌మ పిల్ల‌లు తొలిసారి జ‌రుపుకున్న రాఖీ వేడుక‌కి సంబంధించిన ఫోటోల‌ని య‌ష్ భార్య రాధికా పండిట్ త‌న సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేశారు.

ఫోటోలో ఐరా త‌న త‌మ్ముడికి రాఖీ క‌డుతుండడం చూడ‌వచ్చు. ర‌క్షా బంధ‌న్ ఫోటోల‌ని షేర్ చేసిన రాధికా.. ఇది వారి మొదటి రక్షా బందన్ ... తోబుట్టువుల మధ్య ఉన్న విలువైన బంధం అమూల్యమైనది ! అంటూ కామెంట్ పెట్టింది. కొద్ది రోజుల క్రితం రాధిక పండిట్ తన కుమార్తె ఐరా పుస్తకాలు చదివే చిత్రాన్ని పంచుకున్నారు.  "పరీక్షల సమయంలో కూడా నేను ఇంతగా దృష్టి పెట్టలేదు !!  ఐరాని ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి ఫోన్‌లు / టెలివిజన్‌లకు బదులుగా పుస్తకాలను ఇవ్వడానికి ఇష్టపడతాను అని చెప్పుకొచ్చింది. 
logo