శనివారం 06 మార్చి 2021
Cinema - Dec 04, 2020 , 11:40:02

కేజీఎఫ్ 2 టీజ‌ర్‌కు టైం ఫిక్స్ చేసిన‌ట్టేనా?

కేజీఎఫ్ 2 టీజ‌ర్‌కు టైం ఫిక్స్ చేసిన‌ట్టేనా?

ప్ర‌స్తుతం దేశ‌మంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న‌క్రేజీ ప్రాజెక్ట్స్‌లో కేజీఎఫ్ 2 ఒక‌టి. క‌న్న‌డ ఇండ‌స్ట్రీతో పాటు సినీ ప‌రిశ్ర‌మ స్థాయిని పెంచిన కేజీఎఫ్ చిత్రానికి  సీక్వెల్‌గా ఈ మూవీ రూపొందుతుంది. ప్ర‌శాంత్ నీల్ తెరకెక్కిస్తున్న కేజీఎఫ్ 2 చిత్రంలో య‌ష్‌, సంజ‌య్ ద‌త్, ర‌వీనా టాండ‌న్ ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. గ‌రుడ‌ని హ‌త్య చేసి న‌రాచిలో తన సామ్రాజ్యాన్ని రాఖీ ఎలా బిల్డ్ చేసుకున్నాడు?.. ఎలా న‌రాచీకి కింగ్‌గా మారాడ‌న్న అంశాల నేప‌థ్యంలో ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా రెండ‌వ పార్ట్‌ని రూపొందిస్తున్నారు

దాదాపు కేజీఎఫ్ 2 చిత్ర షూటింగ్ పూర్తి కాగా, ఈ సినిమాకి సంబంధించిన టీజ‌ర్ కోసం అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే జ‌న‌వ‌రి 8న య‌ష్ బ‌ర్త్‌డే కావ‌డంతో ఈ సంద‌ర్బంగా చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేయ‌నున్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. గ్యాంగ్‌స్ట‌ర్ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తుంది.

VIDEOS

logo